కాంగ్రెస్ గూటికి చేరిన బీజేపీ రెబల్ లీడర్
నిత్యం స్వపక్షంపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ, బాలీవుడ్ ప్రముఖ నటుడు శతృఘ్నసిన్హా కాంగ్రెస్ గూటికి చేరారు.

నిత్యం స్వపక్షంపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ, బాలీవుడ్ ప్రముఖ నటుడు శతృఘ్నసిన్హా కాంగ్రెస్ గూటికి చేరారు.
నిత్యం స్వపక్షంపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఎంపీ, బాలీవుడ్ ప్రముఖ నటుడు శతృఘ్నసిన్హా కాంగ్రెస్ గూటికి చేరారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన శతృఘ్నసిన్హా.. గత సార్వత్రిక ఎన్నికలలో గెలిచిన తర్వాత ప్రధాని మోడీ అవలంభించిన ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతీ విషయంలో విమర్శలు సంధించారు. రాజ్యాంగ సంస్థలైన సీబీఐ, ఆర్బీఐలపై మోడీ సర్కారు పెత్తనాన్ని ప్రశ్నించారు.
Read Also : తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మోడీ
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిర్వహించిన పలు వేదికలపైనా మోడీ, అమిత్ షాల ద్వయంపై ద్వజమెత్తారు. దీంతో, ఆయనకు ఇష్టం లేకుంటే పార్టీ నుంచి వెళ్లిపోవాలని బీజేపీ అధిష్టానం కూడా పలుమార్లు విమర్శించింది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలలోనూ పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి సిన్హా ను కాదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ను బరిలోకి దించింది బీజేపీ. దీంతో, సిన్హా బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మొదట్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరకు కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలిసిన శతృఘ్నసిన్హా ఆ పార్టీలో చేరినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
Read Also : మేనిఫెస్టోలో కీలక అంశాలు చెప్పిన చంద్రబాబు