PSLV-C 45 ప్రయోగాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన పైలట్

  • Published By: veegamteam ,Published On : April 2, 2019 / 03:00 AM IST
PSLV-C 45 ప్రయోగాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన పైలట్

Updated On : April 2, 2019 / 3:00 AM IST

ఇస్రో విజయవంతం చేసిన PSLV-C 45 రాకెట్‌ నింగిలోకి దూసుకెళుతున్నప్పుడు .. ఇండిగో విమానం పైలట్ ఆ దృశ్యాలను తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. విమానం కాక్‌పిట్‌లో ఉన్న పైలట్‌ కెప్టెన్‌ కరుణ్‌ కరుంబయా.. రివ్వుమంటూ దూసుకెళ్తున్న రాకెట్‌ను వీడియో తీశాడు. అంతేకాదు.. కుడివైపు కిటికీ నుంచి చూస్తే పీఎస్ఎల్వీ శాటిలైట్ లాంచ్ ను చూడొచ్చని ఫ్లైట్ లో స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ఆ టైమ్ లో లాంచ్ సైట్ నుంచి ఇండిగో విమానం 50 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉంది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.