Reliance Industries Chairman : ఏడాదిగా జీతం తీసుకోని ముకేశ్ అంబానీ!

ఆసియాలో ధనవంతుడు..ముకేశ్ అంబానీ గత సంవత్సరం నుంచి కంపెనీ నుంచి జీతం తీసుకోలేదంట. కరోనా నేపథ్యంలో కంపెనీ వ్యాపారం కోసం ఆయన తన జీతాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వెల్లడించింది. కంపెనీకి సంబంధించి వార్షిక నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

Reliance Industries Chairman : ఏడాదిగా జీతం తీసుకోని ముకేశ్ అంబానీ!

Ambani

Updated On : June 4, 2021 / 9:12 AM IST

Mukesh Ambani Draws Nil Salary : ఆసియాలో ధనవంతుడు..ముకేశ్ అంబానీ గత సంవత్సరం నుంచి కంపెనీ నుంచి జీతం తీసుకోలేదంట. కరోనా నేపథ్యంలో కంపెనీ వ్యాపారం కోసం ఆయన తన జీతాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) వెల్లడించింది. కంపెనీకి సంబంధించి వార్షిక నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2021-21 సంవత్సరానికి ఒక్క పైసా కూడా జీతం తీసుకోలేదని తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో RIL ఛైర్మన్ హోదాలో రూ. 15 కోట్ల జీతం తీసుకున్నారు.

2008-2009 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా 11 ఏళ్ల పాటు…వార్షిక జీతాన్ని రూ. 15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. బోర్డు సభ్యులైన నిఖిల్, హిత్ మేస్వానీలు మాత్రం యథాతథంగా రూ. 24 కోట్ల చొప్పున వేతనం తీసుకున్నారు. రూ. 17.28 కోట్ల కమిషన్ కూడా కలిసింది. ఆర్ఐఎల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో నీతా అంబానీ..గత ఆర్థిక సంవత్సరానికి గాను..రూ. 8 లక్షల సిట్టింగ్ ఫీజుతో పాటు..రూ. 1.65 కోట్ల కమిషన్ ఆర్జించినట్లు వార్షిక నివేదిక వెల్లడించింది.

ఆర్‌ఐఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లైన పీఎంఎస్‌ ప్రసాద్‌, పవన్‌ కుమార్‌ కపిల్‌ జీతాలు మాత్రం పెరిగాయి. 2019 -20లో రూ.11.15 కోట్లుగా నమోదైన ప్రసాద్‌ ప్యాకేజీ.. 2020-21లో రూ.11.99 కోట్లకు పెరిగింది. కపిల్‌ జీతం రూ.4.04 కోట్ల నుంచి రూ.4.24 కోట్లకు చేరుకుంది.

Read More : AP High Court : వామన్ రావు హత్య కేసు విచారణ