BEL Recruitment in Bangalore : బెంగళూరు బెల్ లో 247 పోస్టుల భర్తీ

కనీసం ఆరుమాసాల పని అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి నెలకు 30,000రూ నుండి 55,000రూ వరకు వేతనం చెల్లిస్తారు.

BEL Recruitment in Bangalore : బెంగళూరు బెల్ లో 247 పోస్టుల భర్తీ

Bel

Updated On : January 24, 2022 / 5:23 PM IST

BEL Recruitment in Bangalore : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగుళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీలకు వివరాలకు సంబంధించి ప్రాజెక్ట్ ఇంజినీర్లు 67, ట్రెయినీ ఇంజినీర్లు 169, ఫైనాన్స్ ట్రెయినీ ఆఫీసర్లు 11 ఖాళీలు ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ , సివిల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత కు సంబంధించి స్పెషలైజేషన్ లో కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీఆర్క్, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు జనవరి 1, 2022 నాటికి 28 నుండి 32 ఏళ్లకు మించరాదు.

కనీసం ఆరుమాసాల పని అనుభవం కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి నెలకు 30,000రూ నుండి 55,000రూ వరకు వేతనం చెల్లిస్తారు. అకడమిక్ మెరిట్ మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది ఫిబ్రవరి 4, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://www.bel-india.in