Republic Day 2020: భారత్ మొత్తాన్ని గూగుల్ డూడుల్‌లో

Republic Day 2020: భారత్ మొత్తాన్ని గూగుల్ డూడుల్‌లో

Republic Day 2020 Google Doodle Celebrates Indias Rich Culture 24484

Updated On : June 21, 2021 / 10:37 PM IST

ప్రత్యేక రోజులను పురస్కరించుకొని గూగుల్ స్పెషల్‌గా డూడుల్స్ చేయడం తెలిసిందే. ఇందులో భాగంగానే 71వ గణతంత్ర దినోత్సవం(రిపబ్లిక్ డే) సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ సిద్ధం చేసింది. కలర్‌ఫుల్‌గా ఉండడంతో పాటు భారత సంపద మొత్తాన్ని అందులో కనపడేలా రెడీ చేసింది. నిజానికి ఇదంతా చేసింది భారత్ వాళ్లు కాదు.. సింగపూర్ ఆర్టిస్టులు భారత్‌లో ఉన్న వారసత్వ సంపద ప్రతిబింబించేలా దీనిని డిజైన్ చేశారు.

తాజ్‌మహల్ నుంచి ఇండియా గేట్ వరకూ దాంతో పాటు దేశంలోని పలురకాల సంప్రదాయ నృత్యాలను డూడుల్‌లో చూడొచ్చు. జాతీయ పక్షి పెద్ద నెమలి బొమ్మ కూడా కనీకనిపించకుండా అందులో దాగి ఉంది.

జాగ్రత్తగా చూస్తే వాటితో పాటు ఓ ఏనుగు, ఒంటె కూడా కనిపిస్తాయి. దేశంలోని ప్రధానాంశాలు అన్నీ అందులో ప్రతిబింబిస్తున్నాయి. సామాన్య ప్రయాణికులు వాడే ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థలు అయిన ఆటోలు, బస్సులతో సహా అందులో కనిపిస్తున్నాయి. ఈ డూడుల్ భారత్ లోని వారసత్వ సంపదలు ప్రతిబింబిస్తుంది.

ఈ ఏడాది బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బొల్సనారో రిపబ్లిక్ డే పరేడ్ కు చీఫ్ గెస్ట్ గా రానున్నారు. ఈ సందర్భంగా భారత్ లో ఉన్న బలాలు, విభిన్న సంస్కృతులు, నాగరికతల గురించి 90నిమిషాల పాటు ప్రదర్శన జరగనుంది.