పాము నుంచి బిడ్డను కాపాడుకున్న ఎలుక, వీడియో వైరల్

rescues its baby from the snakes mouth : జంతువు మరొక జంతువును తింటుంది. కాపాడుకోవడానికి ఆ జంతువులు తెగ ప్రయత్నాలు చేస్తుంటాయి. కడుపు నింపుకోవడానికి చంపుకొని తింటుంటాయి. కడుపు నింపుకోవాలనే ఉద్దేశ్యంతో ఓ పాము..చిట్టి ఎలుకను పట్టుకుంది. అక్కడనే ఇదంతా చూస్తున్న తల్లి పెద్ద ఎలుక తన బిడ్డను కాపాడుకోవడానికి తెగ పోరాటం చేసింది. ఓ రోడ్డుపై ఇదంతా జరిగింది. నోట్లో కరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసింది.
వెంటనే ఆ తల్లి ఎలుక..దాని తోకను పట్టుకుంది. విడిపించుకోవడానికి పాము చాలా ప్రయత్నాలే చేసింది. చివరకు గట్టిగా తోకను పట్టుకొనే వరకు ..నోట్లో ఉన్న చిట్టి ఎలుకను వదిలేసి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. దాని వెనుకే తల్లి ఎలుక వెళ్లింది. చివరకు పోయింది అనుకున్న తర్వాతే..చిట్టి ఎలుక దగ్గరకు వచ్చింది. నోట్లో దానిని పట్టుకుని వెళ్లింది. దీనిని Susanta Nanda (ఇండియన్ ఫారెస్టు సర్వీసు) వీడియో తీసి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
https://10tv.in/how-to-stop-snoring-permanently-a-pill-might-soon-be-your-remedy-2/
If you haven’t seen what mothers courage is…
It rescues it baby from the snakes mouth. Unbelievable.. pic.twitter.com/3u6QD2PAl0
— Susanta Nanda (@susantananda3) November 27, 2020