నోటాకు వ్యతిరేకంగా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ప్రచారం
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించిన విషయం తెలిసిందే.

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించిన విషయం తెలిసిందే.
బెంగళూరు : ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించిన విషయం తెలిసిందే. కర్నాటకలో నోటాకు వ్యతిరేకంగా ఓ వ్యక్తి వినూత్న ప్రచారం చేపట్టారు. షిమోగాకు చెందిన రామచంద్ర మలైద్వార్ పోలీస్ శాఖలో డిప్యూటీ ఎస్పీగా పని చేసి రిటైర్డ్ అయ్యారు.
ఓటు హక్కుపై చైతన్యం కలిగించేందుకు ఆయన తన కారుపై స్టిక్కర్లు అతికించి ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ నోటాను వ్యతిరేకించాలని, విధిగా ఓటు వేసి మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు. ఎన్నికల రోజును హాలిడేగా, పిక్ నిక్ డేగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు.
Read Also : కడప జిల్లాలో టీడీపీకి షాక్ : వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి