Chitra Ramakrishna : చిత్రా రామకృష్ణ విచారణలో కీలక విషయాలు వెల్లడి

చెన్నైలోని చిత్రా నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో.. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Chitra Ramakrishna : చిత్రా రామకృష్ణ విచారణలో కీలక విషయాలు వెల్లడి

Chitra

Chitra Ramakrishna trial : నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్‌ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ విచారణలో యోగి అంశంపై సీబీఐ ప్రశ్నించింది. 12 గంటలపాటు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. మనీలాండరింగ్‌కు సంబంధించి కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేశారు. NSEకి సంబంధించిన కీలక విషయాలను హిమాలయ యోగితో పంచుకున్నట్టు తేలిసింది. రహస్య సమచారాన్ని కూడా బాబాతో చిత్రా రామకృష్ణ చెప్పారని వెల్లడైంది. ఆర్థిక, పాలనపరమైన అంశాలను బాబాతో పంచుకున్నట్టు సీబీఐ గుర్తించింది.

మరోవైపు.. ఆనంద్ సుబ్రహ్మమణియన్, రవి నారాయణపై దర్యాప్తు సంస్థల లుక్ అవుట్ నోటీసులు జారీ చేశాయి. మరోవైపు.. చెన్నైలోని చిత్రా నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో.. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలను కూడా సీబీఐ అధికారులు చిత్రా రామకృష్ణ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

Chitra Ramakrishna : ఎన్ఎస్ఈ మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణ ఇంటిపై ఐటీ దాడులు

మరోవైపు.. అజ్ఞాత యోగి ఎవరనే విషయంపై మార్కెట్ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అజ్ఞాత యోగి బయట వ్యక్తే అంటున్నారు సెబీ అధికారులు. NSEలో పనిచేసే వ్యక్తే అజ్ఞాత యోగి అంటూ మరో వాదన బలంగా వినిపిస్తోంది. అటు ఆనంద్ సుబ్రమణియన్ అజ్ఞాత యోగి పేరుతో చిత్రను ట్రాప్ చేశారంటున్నారు.

ఇక తనకు సలహాలు ఇచ్చిన వ్యక్తి ఆనంద్ సుబ్రమణియన్ కాదని చిత్రా రామకృష్ణ తేల్చిచెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో..తెరపైకి కొత్తగా చెన్నైకి చెందిన ఓ స్వామి పేరు బయటకు వచ్చింది. సెంథిల్ స్వామియే అజ్ఞాత యోగి అంటున్నారు. దీంతో దర్యాప్తు సంస్థల అధికారులు తలలు పట్టుకుంటున్నారు.