సారా, రకుల్‌లకు సమన్లు పంపలేదు.. ఎన్‌సిబి క్లారిటీ!

  • Published By: vamsi ,Published On : September 15, 2020 / 10:16 AM IST
సారా, రకుల్‌లకు సమన్లు పంపలేదు.. ఎన్‌సిబి క్లారిటీ!

Updated On : September 15, 2020 / 11:04 AM IST

సుశాంత్ ఆత్మహత్య కేసు కలకలం రేపుతూనే ఉండగా.. సినిమా రాజకీయ నాయకులు చుట్టూ ఈ కేసు తిరుగుతూనే ఉంది. బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఇదిలా ఉంటే ఈ కేసులో నేరసామ్రాజ్య ప్రముఖుల పాత్ర కలగలిపిన ‘డ్రగ్స్‌ కేసు’ కలకలం సృష్టిస్తుంది.




సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మాదకద్రవ్యాల కోణాన్ని విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఈ కేసు విషయంలో నిరంతరం దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ డ్రగ్ కేసుకు సంబంధించిన చాలా మంది పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఎన్‌డిపిఎస్ చట్టం కింద ఇప్పటివరకు అరెస్టయిన రియా చక్రవర్తితో సహా 16 మందిని విచారిస్తున్నారు.

ఈ క్రమంలోనే నటీమణులు సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సిమోన్ ఖంబాటా పేర్లు ఉన్నాయని ఎన్‌సిబి అధికారులు చెబుతున్నారు. అయితే వారి పాత్ర గురించి ఇప్పటివరకు బయటకు రాలేదు. కానీ వారికి సమన్లు పంపినట్లుగా వచ్చిన వార్తలను మాత్రం ఖండించారు అధికారులు. ప్రశ్నించడానికి సమన్లు ​​పంపలేదని అన్నారు.




డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షౌవిక్ చక్రవర్తితో సహా ఆరుగురు వ్యక్తులను అధికారులు సెప్టెంబర్ 22 వరకు జుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. ఇదిలావుండగా, రియా చక్రవతి సోదరుడు షౌవిక్ స్నేహితుడు సూర్యదీప్ మల్హోత్రాను ఎన్‌సిబి సోమవారం ప్రశ్నించింది. ఇది కాకుండా రియా చక్రవర్తి తల్లి సంధ్యను కూడా ప్రశ్నించారు. డ్రగ్స్ కొనడానికి అతని ఫోన్ నుంచి కాల్స్ లేదా మెసేజెస్ వచ్చాయా? అనే విషయాన్ని ఏజెన్సీ దర్యాప్తు చేస్తుంది.
https://10tv.in/bollywood-celebs-sara-ali-khan-rakul-preet-singh-and-simone-khambatta-on-ncb/
రియా చక్రవర్తి, షౌవిక్ మరియు మరో నలుగురు బెయిల్ పిటిషన్‌లను స్పెషల్ జడ్జి జిబి గురవ్ శుక్రవారం తోసిపుచ్చారు. నిందితులను బెయిల్‌పై విడుదల చేస్తే ఆమె సాక్ష్యాలను దెబ్బతీసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.