Handbag : మడతపెట్టే కుర్చీలా హ్యాండ్ బ్యాగ్..ధర ఎంతో తెలిస్తే షాక్ తింటారు

Handbag : మడతపెట్టే కుర్చీలా హ్యాండ్ బ్యాగ్..ధర ఎంతో తెలిస్తే షాక్ తింటారు

Handbag

Updated On : April 28, 2021 / 7:18 PM IST

Chair Bag : హ్యాండ్ బ్యాగ్..ప్రతొక్కరికి అవసరం ఉంటుంది. ప్రధానంగా మహిళలకు..వారు బయటకు వచ్చినప్పుడు..హ్యాండ్ బ్యాగ్ తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. ఈ బ్యాగ్ ల విషయానికి వస్తే..ఎన్నో వైరెటీలు ఉంటాయి. వారి స్థోమతను బట్టి బ్యాగ్ లను కొనుగోలు చేస్తుంటారు. రూ. 100 నుంచి మొదలకుని వేల రూపాయల వరకు ఖరీదు పలుకుతుంటాయి.

పార్టీలు, ఆఫీసులు, ఇతర పనులపై వెళ్లేందుకు వారికి అనుగుణంగా..హ్యాండ్ బ్యాగ్ లు కొనుక్కొంటుంటారు. ఇక ప్రముఖులు ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్ లు చాలా ఖరీదుగా ఉంటాయి.

కానీ..ఓ హ్యాండ్ బ్యాగ్ సంబంధించిన న్యూస్ సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు మనస్సు పారేసుకుంటున్నారు. కుర్చీ ఆకారంలో ఉన్న ఈ హ్యాండ్ బ్యాగ్ తెగ ఆకట్టుకొంటోంది. మడత కుర్చీలా కనిపిస్తున్న ఈ హ్యాండ్ బ్యాగ్ ధర $895 (Rs 66,794). బ్యాగ్ వేసుకున్న చిత్రాలను Lexi Brown, PhD ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

Read More : ఆక్సిజన్ పొదుపు కోసం..మారుతీ సుజుకీ ఫ్లాంట్లు మూసివేత