ఎంజాయ్ చేస్కోండి : లవర్స్ కోసం స్పెషల్ పార్క్

భారత్ లోని ఎక్కువ సిటీల్లో లవర్స్ ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవడానికి సేఫ్ స్పేస్ లేదు. పూనే కూడా దీనికి మినహాయింపు ఏం కాదు. ఇక్కడ కూడ అదే పరిస్థితి ఉంది. పార్కుల్లో మాట్లాడుకుంటున్న లవర్స్ పై భౌతిక దాడులు చేయటం, లైంగికంగా వేదించటం, మానసికంగా హింసించటం ఎక్కువైపోయాయి. దీంతో పూనేకి చెందిన కొంతమంది యువతీ యువకులు కలిసి రైట్ టు లవ్ గ్రూప్ పేరుతో పార్కుల్లో యువతీ, యువకుల పై జరిగే దాడులను అరికట్టాలని, పూణే మున్సి పల్ కార్పొరేషన్ (PMC) కమిషనర్ కు ఓ లెటర్ రాశారు.
సిటీలో 110 గార్డెన్స్ ఉన్నాయని ఒక్కదాంట్లో కూడా లవర్స్ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదని కపుల్స్ కోసం ఒక్కటి కూడా రిజర్వుడ్ పార్కు లేదని లవర్స్ కోసం ప్రత్యేకంగా ఒక పార్క్ ని కేటాయించాలని కమిషనర్ సౌరబ్ రావుకు రాసిన లెటర్ లో డిమాండ్ చేశారు. ఈ ఏడాది వాలంటైన్స్ డే( ఫిబ్రవరి 14, 2019) రోజున దీని పై నిర్ణయం ప్రకటించాలని, ఒక వేళ ఎటువంటి ప్రకటన చేయకపోతే PMC బయట ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు.
2015 లో కొంత మంది లాయర్లు, విద్యార్ధులు, ఐటీ ప్రొఫెషనల్స్, సోషల్ వర్కర్స్ అందరు కలిసి రైట్ టు లవ్ ని ఏర్పాటు చేశారు. లవ్ లో ఉన్నవాళ్ల హక్కుల్ని కాపాడే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ గ్రూప్ ని ఏర్పాటు చేశారు.