Priyanka Chaturvedi: యాంకర్‌గా రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యురాలు

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సంసద్ టీవీ యాంకర్ పదవికి రాజీనామా చేశారు.

Priyanka Chaturvedi: యాంకర్‌గా రాజీనామా చేసిన పార్లమెంట్ సభ్యురాలు

Priyanka

Updated On : December 6, 2021 / 7:47 AM IST

Priyanka Chaturvedi: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ‘వికృత’ ప్రవర్తన కారణంగా రాజ్యసభ నుండి పదకొండు మందితో పాటు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది సంసద్ టీవీ యాంకర్ పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకి ఓ లేఖ రాశారు ప్రియాంక.

‘‘సంసద్ టీవీ షో మేరీ కహానీ యాంకర్‌ బాధ్యతలు నుంచి తప్పుకోవడం నాకు బాధగానే ఉంది. కానీ, మా 12 మంది ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేసిన కారణంగా పార్లమెంటరీ విధులను నిర్వర్తించలేకపోయాను. అందుకే, నేను రాజ్యసభ టీవీ యాంకర్‌ బాధ్యతలు నుంచి తప్పుకుంటున్నాను.’’ అని ప్రియాంక చతుర్వేది లేఖలో పేర్కొన్నారు.

పన్నెండు మంది విపక్ష సభ్యులను పార్లమెంటు శీతాకాల సమావేశాలకి హజరుకాకుండా రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయగా.. ఈ సస్పెన్షన్ అప్రజాస్వామికం అని, ఎగువసభలో నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందినవారు ఆరుగురు, తృణమూల్ కాంగ్రెస్, శివసేనలకు చెందిన ఇద్దరు, సీపీఐ, సీపీఐ(ఎం)లకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.

తమను సస్పెండ్ చేయడంపై ఎంపీలు అందరూ పార్లమెంట్ ఎదుట నిరసనలు చేస్తున్నారు. పార్లమెంటు ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు రోజంతా నిరసనలు చేపట్టారు. తమ సస్పెన్షన్‌ను రద్దు చేసేంతవరకు ప్రతి రోజూ నిరసనలు చేయాలని నిర్ణయించారు.