ఉల్లిపాయల దండ మెడలో వేసుకుని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే

మెడలో ఉల్లిపాయల దండ వేసుకుని బీహార్ ఆర్జేడీ ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చారు. బీహార్ లో ఉల్లిపాయలు భారీ ధర పలుకుతోందని..ఉల్లిపాయల ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యే శివచంద్ర రామ్ అసెంబ్లీకి వచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివచంద్ర రామ్ మాట్లాడుతూ..ఉల్లిపాయలు ఇలా రోజు రోజుకు ధరలు పెరిగిపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ దీంతో ఉల్లిపాయలకు కొనుక్కోవటమే మానేశారని అన్నారు.దీని వల్ల ప్రజలు తమ ఆరోగ్యానికెంతో అవసరమైన ఆహారాన్ని కోల్పోతున్నారన్నారు. కిలోరూ. 80 రూపాయలకు తగ్గడం లేదని అన్నారు.
ఉల్లిని 35 రూపాయలకే ప్రజలకు అందిచేలా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని నితీశ్ కుమార్ ప్రభుత్వం వాగ్దానాలకే పరిమితమైంది తప్ప అమలు చేసేలా ఎటువంటి చర్యలు తీసుకోవటంలేదని శివచంద్రరామ్ ఆరోపించారు.ఉల్లితోపాటు కూరగాయల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్ష ఆర్జేడీ ఎమ్మెల్యే శివచంద్ర రామ్ విధాన సభ ఎదుట నిరసన తెలియజేశారు.
కాగా..దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. కిలో ఉల్లి ధర రూ.80 నుంచి రూ.100 అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాలలో కిలో ఉల్లి రూ.100 దాటిన విషయం తెలిసిందే.