రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక… విపక్షాల అభ్యర్థిగా ఆర్జేడీ ఎంపీ మనోజ్ నామినేషన్

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి విపక్షాల అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎంపీ మనోజ్ ఝా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. జేడీయూ సభ్యుడు హరివంశ్ సింగ్ పదవీకాలం ఏప్రిల్‌లో ముగియడంతో డిప్యూటీ చైర్మన్ పదవి ఖాళీ అయ్యింది. కాగా, ఆ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా తిరిగి ఆయనే పోటీ చేస్తున్నారు. దీంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం బీహార్‌కు చెందిన ఇద్దరు నేతలైన మనోజ్ ఝా, హరివంశ్ సింగ్ మధ్య పోటీ నెలకొన్నది.
ప్రతిపక్షాల తరుఫున పోటీ చేస్తున్న మనోజ్ ఝాకు ఇప్పటి వరకు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, శివసేన, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఎస్పీ, కేరళ కాంగ్రెస్ (ఎం), సీపీఐ,సిపిఎం,ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వంటి 12 విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. బీఎస్పీ, ఆమ్ఆద్మీపార్టీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు తమ అభ్యర్థికి మద్దతు కోసం జేడీయూ కూడా ప్రత్నాలు చేస్తున్నది. బీహార్ సీఎం నితీశ్ కుమార్…ఇటీవల ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం జగన్ తో ఫోన్‌లో మాట్లాడి ఆ పార్టీ మద్దతు కోరారు.
https://10tv.in/dinesh-kumar-khara-is-top-pick-for-sbi-chairman/
కాగా, ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో 123 ఓట్లు పొందిన వారు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికవుతారు. ప్రస్తుతం మద్దతిచ్చిన 12 ప్రతిపక్ష పార్టీలకు సభలో 91 మంది సభ్యులు ఉన్నారు. బీఎస్పీ, ఆప్‌ను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 95కి చేరుతుంది. అయితే 123 ఓట్లు సాధించడానికి ఇంకా 28 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల తరుఫున పోటీ చేస్తున్న మనోజ్ ఝా గెలవడం కష్టమే.