కరోనా వారియర్ : పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి రూ.కోటి చెక్ ఇచ్చిన సీఎం

  • Published By: nagamani ,Published On : August 21, 2020 / 03:51 PM IST
కరోనా వారియర్ : పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి రూ.కోటి చెక్ ఇచ్చిన సీఎం

Updated On : August 21, 2020 / 4:28 PM IST

కరోనాతో యావత్ ప్రపంచం వణికిపోతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తమ విధులను నిర్వహిస్తూ కరోనా యోధులుగా సేవలు చేస్తున్నారు డాక్టర్లు, పారిశుద్ధ్యకార్మికులు,పోలీసులు. ఈ మాట మనం ప్రతీ రోజు ఫోనులో వింటూనే ఉంటున్నాం.



ఈ క్రమంలో వారు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటివారికి మనం ఎంత చేసిన తక్కువే. కానీ వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలబడాలనే ఉద్ధేశ్యంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనాతో సోకి చనిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి రూ.1కోటి రూపాయల చెక్కును అందించారు. ఆయనే స్వయంగా అతని ఇంటికి వెళ్లి దీన్ని అందజేశారు.

రాజు అనే పారిశుద్ధ్య కార్మికుడు కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో కూడా తన విధుల్ని నిర్వహించాడు. ఈ క్రమంలో కొన్ని రోజులకు రాజుకు కరోనా సోకి చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేజ్రీవాల్ చలించిపోయారు. అతని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన మీ కొడుకుని తీసుకురాలేను కానీ..ఆర్థికంగా మీకు సహాయం చేయటం నా బాధ్యతగా భావించాలని తెలుపుతూ రాజు ఇంటికి వెళ్లి వారికి ధైర్యం చెప్పి..అతని కుటుంబానికి కోటి రూపాయల చెక్కును అందజేశారు.



ఈ సందర్భంగా రాజు చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వం తరుపున కోటి రూపాయల చెక్‌ను అతని కుటుంబానికి అందించారు. రాజు చేసిన సేవ ఎంతో మందికి ఆదర్శమని ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ గుర్తు చేసుకున్నారు.