kerala High Court : కోవిడ్ సర్టిఫికేట్‌పై మోదీ ఫొటో తొలగించాలని పిటిషన్..రూ. లక్ష ఫైన్ వేసిన కోర్టు
వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లపై ప్రధాని మోదీ ఫొటో తొలగించాలనే దాఖలైన పిటిషన్ పై కేరళ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

Modi Photo
PM Photo On Covid – 19 Vaccine Certificates : వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లపై ప్రధాని మోదీ ఫొటో తొలగించాలనే దాఖలైన పిటిషన్ పై కేరళ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పనికిమాలినదిగా అభివర్ణించింది. అంతేగాకుండా..ఈ పిటిషన్ ను దాఖలు చేసిన వ్యక్తికి రూ. లక్ష ఫైన్ విధించింది. దేశానికి ప్రధాన మంత్రి అయితే..అతను కాంగ్రెస్ ప్రధాని లేదా బీజేపీ ప్రధాని అని..ఏ రాజకీయ పార్టీ వ్యక్తి అంటూ..ఎవరూ చెప్పలేరని పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం ఒకసారి ప్రధాని అయితే..ప్రతి పౌరుడికి గర్వకారణంగా ఉండాలని జస్టిస్ పీవీ Kunhikrishnan వ్యాఖ్యానించినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ పేర్కొంది.
Read More : Students Suicide : 7 ఏళ్లలో 122 మంది ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్య: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
అయితే..రాజకీయ వైఖరిపై మాత్రం విబేధించవచ్చు కానీ..ధైర్యాన్ని పెంపొందించే సందేశంతో ప్రధాన మంత్రి ఫొటో ఉంటే…టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేశారు. ఈ పిటిషన్ వేసిన వ్యక్తి రూ. లక్ష జరిమాన కట్టాలని..ఆరువారాల్లోగా కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథార్టీ (KLSA)కి జమ చేయాలని సూచించింది. సకాలంలో జమ చేయకపోతే..అతని ఆస్తులను విక్రయించైనా డబ్బులను రికవరీ చేయాలని కోర్టు పేర్కొంది. ఈ పిటిషన్ వెనుక రాజకీయ ఉద్దేశ్యం దాగి ఉందని..ప్రజా ప్రయోజనాల కోసం కాదని..కేవలం ప్రచారం కోసమేనంటూ..ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Read More : Madhya Pradesh : నోట్ల కట్టలను విసిరేసిన వృద్ధుడు, వీడియో వైరల్
కోర్టులో ఇతర కేసుల పిటిషన్ లు నమోదవుతున్న క్రమంలో..అనవసరమైన పిటిషన్లను ప్రోత్సాహించలేమని స్పష్టం చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ల కోసం ప్రజలు డబ్బులు చెల్లిస్తుంటే…సర్టిఫికేట్ పై ప్రధాని బొమ్మ ఉండడం ప్రాథమిక హక్కలు ఉల్లంఘన కిందకు వస్తుందని సమాచార హక్కు కార్యకర్త Peter Myaliparampil ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇతర దేశాల్లో వ్యాక్సిన్ సర్టిఫికేట్ లపై ప్రధాన మంత్రుల ఫొటోలు లేవని చెప్పినప్పుడు కోర్టు తీవ్రంగా స్పందించింది. తాము ప్రధానిని చూసి గర్విస్తున్నట్లు పేర్కొనట్లు సమాచారం.