జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో మరోసారి ఆర్టికల్ 370 మంటలు..

మాటల యుద్ధం కాస్తా తోపులాటకు దారితీయడంతో అసెంబ్లీలో యుద్ధ వాతావరణం నెలకొంది.

జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో మరోసారి ఆర్టికల్ 370 మంటలు..

Updated On : November 9, 2024 / 12:47 AM IST

Jammu Kashmir Assebly : జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో అదే సీన్. ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని అధికార ఎన్సీ, కాంగ్రెస్ సభ్యులు పట్టుబడుతున్నారు. కుదరదని విపక్ష బీజేపీ సభ్యులు వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో జమ్ముకశ్మీర్ అసెంబ్లీ మళ్లీ రణరంగమైంది. సభ్యులు బాహాబాహికి దిగుతున్నారు. మరోపక్క ఆర్టికల్ 370 పునరుద్దరణ తన ప్రాణం ఉన్నంతవరకు జరగంటూ సాక్ష్యాత్తు ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆర్టికల్ 370 రచ్చ కొనసాగుతోంది.

జమ్ముకశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్దరణపై అసెంబ్లీ అట్టుడుకుతోంది. ఆర్టికల్ 370 సెక్షన్ 35ఏని మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది ఎన్సీ కాంగ్రెస్ సర్కార్. దీన్ని విపక్ష బీజేపీ నేతలు స్ట్రాంగ్ గా వ్యతిరేకిస్తున్నారు. దీంతో నిత్యం అసెంబ్లీలో వాతావరణం యుద్ధ రంగాన్ని తలపిస్తోంది.

ఆర్టికల్ 370 తీర్మానంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కాస్తా తోపులాటకు దారితీయడంతో అసెంబ్లీలో యుద్ధ వాతావరణం నెలకొంది. సభ్యలోని ఎమ్మెల్యేలంతా బాహాబాహికి దిగారు. బీజేపీ ఎమ్మెల్యేలు అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభ ప్రారంభమైన రోజు నుంచి ఇదే తీరు. వరుసగా మూడు రోజులు అసెంబ్లోలో గందరగోళమే నెలకొంది.

 

Also Read : ట్రంప్ వచ్చాడు.. యుద్ధాలు ఆపేస్తాడా? అసలు యుద్ధాలు ఆపడం ఆయనకు సాధ్యమేనా?