పాకిస్థాన్‌కు పాకిస్థాన్‌లోనే కౌంటర్‌ ఇచ్చిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌

అభివృద్ధికి శాంతి, స్థిరత్వం అవసరమన్న విషయం సుస్పష్టమని తెలిపారు.

పాకిస్థాన్‌కు పాకిస్థాన్‌లోనే కౌంటర్‌ ఇచ్చిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌

Updated On : October 16, 2024 / 3:31 PM IST

పాకిస్థాన్ ఉగ్రవాదంపై ఆ దేశంలోనే కామెంట్స్‌ చేశారు భారతదేశ విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో జైశంకర్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సదస్సులో జైశంకర్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉగ్రవాదం, వేర్పాటువాదం ఉంటే అది ద్వైపాక్షిక వాణిజ్యం, సత్సంబంధాలకు దారి తీయదని స్పష్టం చేశారు.

అభివృద్ధికి శాంతి, స్థిరత్వం అవసరమన్న విషయం సుస్పష్టమని తెలిపారు. సరిహద్దుల వెంట ఉన్న ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం వంటి మూడు చెడు విషయాలను ఎదుర్కోవడంలో దృఢంగా, రాజీపడకుండా ఉండాలని చెప్పారు. సరిహద్దుల వద్ద ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం వంటి కార్యకలాపాలు ఉంటే ఇటువంటి చర్యలు వాణిజ్యం, ఇతర సత్సంబంధాలు ప్రోత్సహించే అవకాశం ఉండబోదని అన్నారు.

ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదంతో పోరాటం చేయడం ప్రస్తుత రోజుల్లో కీలకంగా మారిందని జైశంకర్ చెప్పారు. ప్రపంచీకరణ, పరిస్థితులను తిరిగి సమతుల్యం చేయడం అనే అంశాలను ఎస్‌సీవో దేశాలు ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీనికి నిజాయితీతో కూడిన చర్చ, విశ్వాసం, ఇరుగుపొరుగు దేశాల సహకారం, ఎస్‌సీవో రూపొందించుకున్న మార్గదర్శకాల పట్ల నిబద్ధతతో ఉండడం అవసరమని అన్నారు.

1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుకు రతన్ టాటా రాసిన లేఖ ఇప్పుడు వైరల్.. ఎందుకంటే?