Sadhguru Jaggi Vasudev bike ride : లండన్ నుంచి భారత్ కు..జగ్గీ వాసుదేవ్ బైక్ యాత్ర..

ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ యూకేలోని లండన్ నుంచి భారత్ కు మోటార్ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర 100రోజుల పాటు 27 దేశాల పరిధిలో 30,000 కిలోమీటర్లు సాగనుంది

Sadhguru Jaggi Vasudev bike ride : లండన్ నుంచి భారత్ కు..జగ్గీ వాసుదేవ్ బైక్ యాత్ర..

Sadhguru Jaggi Vasudev 100 Days Solo Bike Ride

Updated On : March 3, 2022 / 12:01 PM IST

Sadhguru Jaggi Vasudev 100 days solo bike ride : ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ 100రోజుల పాటు మోటర్ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. యూకేలోని లండన్ నగరం నుంచి భారత్ కు మోటార్ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో ఆయనకు తోడుగా ఎవ్వరు ఉండరు.కేవలం జగ్గీ వాసుదేవ్ మాత్రమే ఒంటరిగా ఈ యాత్రను చేయనున్నారు. శివరాత్రి రోజున ఈశా ఫౌండషన్ లో జరిగిన మహోత్సవంలో వాసుదేవ్ ఈ విషయాన్ని తెలిపారు. నేలతల్లి కోసం ఖండాంతర మోటారు సైకిల్ యాత్ర చేయున్నానని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయటానికే ఈ బైక్ యాత్ర అని తెలిపారు. లండన్ నుంచి భారత్ వరకు 100 రోజుల పాటు మోటారు సైకిల్ పై తాను ఒక్కడినే యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.

Also read :  Sadhguru Jaggi Vasudev : పిల్లలతో పటాకులు కాల్పించండీ..కాలుష్యం పెరగొద్దనుకుంటే నడిచి వెళ్లండీ..

తన ఈ మోటార్ సైకిల్ యాత్రలో భాగంగా పర్యటించిన ప్రతి దేశంలో నేల భూసారాన్ని పరిరక్షించేందుకు విధానపరమైన చర్యలు తీసుకోవాలంటూ అక్కడి పాలకులను కోరతామని సద్గురు తెలిపారు. 100 రోజుల యాత్రలో భాగంగా 27 దేశాల పరిధిలో 30,000 కిలోమీటర్ల మేర ఆయన ప్రయాణం చేయనున్నారు.

‘‘ఈ 100 రోజుల్లో ప్రతి ఒక్కరు ప్రతి రోజు కనీసం 5-10 నిమిషాల పాటు నేల గురించి మాట్లాడాలి. ఇది ఎంతో ముఖ్యమైనది. చాలా అవసరమైనది. ప్రపంచం మొత్తం 100 రోజుల పాటు భూమి గురించి మాట్లాడాలి. శాస్త్రవేత్తలతో పాటు, ఐక్యరాజ్యసమితి ఏజెన్సీలు మరో 55 ఏళ్లపాటుమాత్రమే సాగు చేసుకోవడానికి అనుకూలంగా భూమి ఉంటుందని చెబుతున్నాయి. ఆహార కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి. కాబట్టి భూసారం గురించి ఆహార భద్రత గురించి ఆహారోత్పత్తి గురించి ప్రతీ ఒక్కరు ఆలోచించాలని సద్గురు సూచించారు.

ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలలి అని పిలుపునిచ్చారు. భూమి ఒక అద్భుతం. చనిపోతే నేలలోనే పాతిపెడతారు. అక్కడే ప్రాణం కూడా మొలకెత్తుతుంది. మనం భూమి నుంచే ఉద్భవిస్తాం. భూమిపై ఉన్న దానినే తింటాం. చనిపోతే తిరిగి అదే భూమిలోకి చేరతాం’’ అని సద్గురు భూతల్లి పరమార్థం గురించి వివరించారు.

Also read : Ukraine Russia War : యుక్రెయిన్‌లో బందీలుగా భారత విద్యార్థులు.. కేంద్ర విదేశాంగ శాఖ వివరణ..!

కాగా..జగ్గీ వాసుదేవ్ “సద్గురు” గా ప్రసిద్ధులైన యోగి, మార్మికులు, ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈశా సంస్థ ఇండియాలోనే కాకుండా.. అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈశా సంస్థ అనేక సామాజిక ఆభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది. అందువల్లే ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆర్ధిక, సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. సద్గురు సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.