Ukraine Russia War : యుక్రెయిన్‌లో బందీలుగా భారత విద్యార్థులు.. కేంద్ర విదేశాంగ శాఖ వివరణ..!

యుక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపులో నెలకొన్న వివాదంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. యుక్రెయిన్‌లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది.

Ukraine Russia War : యుక్రెయిన్‌లో బందీలుగా భారత విద్యార్థులు.. కేంద్ర విదేశాంగ శాఖ వివరణ..!

Ukraine Russia War Ukraine Kept Indian Students As Hostages In Kharkiv

Ukraine Russia War : యుక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపులో నెలకొన్న వివాదంపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. యుక్రెయిన్‌లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది. భారత  విద్యార్థులు బందీలుగా ఉన్నారంటూ మాకు ఎలాంటి నివేదికలు అందలేదని కేంద్రం వెల్లడించింది.

రష్యా దాడులతో యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పౌరులను తరలించేందుకు భారత్‌ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో రష్యా, యుక్రెయిన్ దేశాలు తమ పౌరులను సురక్షితంగా తరలించేందుకు సహకరించాలని కేంద్రం కోరింది. ఈ క్రమంలోనే భారతీయ విద్యార్థులను బందీలుగా చేసుకున్నాయంటూ రష్యా, యుక్రెయిన్ ఆరోపణలు పరస్పర ఆరోపణలకు దిగాయి. ఖార్కివ్ నుంచి భారత విద్యార్థులను తరలించడానికి రష్యా ప్రయత్నిస్తోంది.

యుక్రెయిన్‌లోని మా ఎంబసీలో భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉందని తెలిపింది. యుక్రెయిన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు ఖార్కివ్ నుంచి బయల్దేరారు. విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న పరిస్థితి గురించి మాకు ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపింది. ఖార్కివ్ సహా ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులను పశ్చిమ యుక్రెయిన్ సరిహద్దులకు తీసుకెళ్లడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని యుక్రెయిన్ అధికారుల మద్దతు కోరినట్టు తెలిపింది.

రష్యా, రొమేనియా, పోలాండ్, హంగరీ, స్లోవేకియా, మోల్డోవాతో దేశాలతో సమర్థవంతంగా సమన్వయం చేస్తున్నామని తెలిపారు. గత కొన్నిరోజులుగా యుక్రెయిన్ నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ పౌరులు స్వదేశానికి వచ్చారని తెలిపింది. భారతీయ పౌరుల తరలింపునకు యుక్రెయిన్ అధికారులు అందిచంని సాయాన్ని అభినందిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది.

Ukraine Russia War Ukraine Kept Indian Students As Hostages In Kharkiv (1)

Ukraine Russia War Ukraine Kept Indian Students As Hostages In Kharkiv

భారతీయుల తరలింపులో సహకారం అందిస్తున్న యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు ధన్యవాదాలను తెలిపింది. యుక్రెయిన్ బలగాలు భారతీయ విద్యార్థులను తమ బందీలుగా ఉంచుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖార్కివ్‌ నుంచి బెల్గోరోడ్‌కు వెళ్తున్న భారతీయ విద్యార్థులను బలవంతంగా నిర్బంధిస్తున్నారంటూ రష్యా రక్షణశాఖ అధికారిక ప్రతినిధి, మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ సంచలన ఆరోపణలు చేశారు. భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలతో సిద్ధంగా ఉన్నామని రష్యా సాయుధ దళాలు ప్రకటించాయి.

అందులో భాగంగానే సైనిక రవాణా విమానాలు, భారతీయ విమానాలతో రష్యా భూభాగం నుంచి విధ్యార్థులను ఇంటికి పంపిస్తామని పేర్కొంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో సంభాషించిన కొన్ని గంటల తర్వాత రష్యా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది. భారత్‌, పాక్, చైనాతో పాటు పలు దేశాల విద్యార్థులు రష్యన్ సాయుధ దురాక్రమణకు బందీలుగా మారారని యుక్రెయిన్ విదేశాంగ శాఖ ఆరోపించింది.

Read Also : Historic Vote Russia : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాల్సిందే.. ఐక్యరాజ్య సమితి తీర్మానం..!