Historic Vote Russia : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాల్సిందే.. ఐక్యరాజ్య సమితి తీర్మానం..!

Historic Vote Russia : యుక్రెయిన్‌, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణ చర్యలను ప్రపంచ దేశాలు హెచ్చరించినా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపడం లేదు.

Historic Vote Russia : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాల్సిందే.. ఐక్యరాజ్య సమితి తీర్మానం..!

Historic Vote Russia U.n. General Assembly In Historic Vote Denounces Russia Over Ukraine Invasion

Historic Vote Russia : యుక్రెయిన్‌, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణ చర్యలను ప్రపంచ దేశాలు హెచ్చరించినప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాడు.
యుద్ధాన్ని ఆపివేయాలంటూ నాటో సభ్యదేశాలు హెచ్చరించినా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు.

యుక్రెయిన్‌పై రష్యా చర్యలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలోని సర్వసభ్య సమావేశంలో ఓటింగ్ జరిగింది. యుక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని తక్షణమే ఆపివేయాలంటూ ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. యుక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సౌర్వభౌమధికారాన్ని సమర్థిస్తూ ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UNGA) ఆమోదించింది. రష్యాకు వ్యతిరేకంగా తీర్మానానికి అనుకూలంగా 141 సభ్య దేశాలు ఓటు వేశాయి.

Historic Vote Russia U.n. General Assembly In Historic Vote Denounces Russia Over Ukraine Invasion (1)

Historic Vote Russia U.n. General Assembly In Historic Vote Denounces Russia Over Ukraine Invasion

అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, అప్ఘానిస్తాన్, ఐర్లాండ్‌ సహా 141 సభ్య దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటువేశాయి. రష్యాకు అనుకూలంగా మరో ఐదు దేశాలు వ్యతిరేకించాయి. యుక్రెయిన్ విషయంలో ఐరాసలో ఓటింగ్‌కు భారత్ సహా
35 దేశాలు దూరంగా ఉన్నాయి. మెజార్టీ దేశాలు యుక్రెయిన్‌కు అనుకూలంగా ఓటువేయడంతో తీర్మానం ఆమోదం పొందినట్లు ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రకటించింది. యుక్రెయిన్‌పై యుద్ధంలో అణ్వాయుధాలను సిద్ధం చేయడాన్ని తీవ్రంగా
తప్పుపట్టింది.

యుద్ధాన్ని విరమించి ఇరుదేశాల మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనేలా చేయాలని సూచించింది. యుక్రెయిన్, రష్యా యుద్ధంపై భారత్‌ మొదటి నుంచే తటస్థంగా వ్యవహరిస్తోంది. ఇరుపక్షాలు శాంతియుత మార్గంలో చర్చల
ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తోంది. ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు దూరంగా ఉంది. ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలపై ఓటింగ్‌కు కూడా భారత్ గౌర్హాజర్ అయింది.

Read Also :  Russia Ukraine Talks : యుద్ధం ఆగేనా? ర‌ష్యా, యుక్రెయిన్ మ‌ధ్య రేపు రెండో విడ‌త చ‌ర్చ‌లు