Russia Ukraine Talks : యుద్ధం ఆగేనా? ర‌ష్యా, యుక్రెయిన్ మ‌ధ్య రేపు రెండో విడ‌త చ‌ర్చ‌లు

రష్యా, యుక్రెయిన్(Russia Ukraine Talks) మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. మ‌రోమారు బెలార‌స్‌లోనే బుధ‌వారం నాడు రెండో విడ‌త చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఇరు దేశాలు నిర్ణ‌యించాయి.

Russia Ukraine Talks : యుద్ధం ఆగేనా? ర‌ష్యా, యుక్రెయిన్ మ‌ధ్య రేపు రెండో విడ‌త చ‌ర్చ‌లు

Russia Ukraine Talks

Russia Ukraine Talks : రష్యా, యుక్రెయిన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. మ‌రోమారు బెలార‌స్‌లోనే బుధ‌వారం నాడు రెండో విడ‌త చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఇరు దేశాలు నిర్ణ‌యించాయి. మ‌రి ఈ చ‌ర్చ‌ల్లో అయినా యుద్దం ఆగే దిశ‌గా నిర్ణ‌యం వ‌స్తుందా? అన్న అంశ‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

సోమ‌వారం నాడు ర‌ష్యా మిత్ర దేశం బెలార‌స్‌లో ఇరు దేశాల ప్ర‌తినిధుల మ‌ధ్య తొలి విడ‌త చ‌ర్చ‌లు జ‌రిగాయి. 3 గంట‌ల‌కు పైగా జ‌రిగిన ఈ చ‌ర్చ‌ల్లో ఇరు దేశాలు త‌మ త‌మ వాద‌న‌ల‌కే క‌ట్టుబ‌డ్డాయి. దీంతో ఎలాంటి ఫ‌లితం లేకుండానే చ‌ర్చ‌లు ముగిశాయి. అలా సోమ‌వారం అసంపూర్తిగా ముగిసిన చ‌ర్చ‌ల‌ను పునఃప్రారంభించాల‌ని ఇరు దేశాలు భావించాయి.

Russia Ukraine War : నాడు జర్మనీ కోసం హిట్లర్… నేడు రష్యా కోసం పుతిన్

ఓవైపు హోరాహోరీగా యుద్ధం జరుగుతుంటే.. మ‌రోవైపు చ‌ర్చ‌లు నడుస్తున్నాయి. అనూహ్యంగా యుక్రెయిన్‌పైకి దండెత్తిన ర‌ష్యా.. బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆరు రోజులుగా సాగిస్తున్న యుద్ధాన్ని ర‌ష్యా అంత‌కంత‌కూ పెంచుకుంటూ పోతూనే ఉంది. కాగా, తన దగ్గరున్న కొద్దిపాటి సైన్యం, ఆయుధాలతోనే యుక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తోంది. ర‌ష్యా దాడుల‌ను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్ర‌మంలో చ‌ర్చ‌లంటూ ర‌ష్యా ప్ర‌తిపాదించ‌గా.. యుక్రెయిన్ కూడా అందుకు అంగీక‌రించింది.

వరుసగా 6వ రోజు(మార్చి 1) కూడా రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర పోరు నడుస్తోంది. రష్యా చెలరేగిపోతోంది. మరింత దూకుడు పెంచింది. దాడులను ఉధృతం చేసింది. దీంతో యుక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఓవైపు బెలారస్‌ వేదికగా చర్చలకు రావాలని పిలుపునిస్తూనే.. మరోవైపు యుక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌ను చుట్టుముట్టింది రష్యా. రష్యా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్కివ్‌కు శివారులోనే ఇప్పటిదాకా ఉన్న సైన్యం తాజాగా.. నగరంలోకి అడుగు పెట్టే దిశగా కదిలింది. అయితే రష్యా సైన్యానికి యుక్రెయిన్‌ బలగాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. నగరంలోకి అడుగు పెట్టకుండా బలగాలు ఎదురొడ్డి నిలిచాయి.

Indian Student: రష్యా బాంబు దాడిలో భారత విద్యార్థి మృతి

మరోవైపు రాజధాని నగరం కీవ్‌లోనూ యుక్రెయిన్‌ సైన్యం, పౌరుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో రష్యా తమ లక్ష్యాన్ని వైమానిక స్థావరాలు, ఇంధన వనరుల వైపు మళ్లించింది. తెల్లవారుజామున ఆకాశంలో బాంబుల మోత వినిపించడంతో కీవ్‌ నగరంలోని ప్రజలు తమ ఇళ్ల బేస్‌మెంట్లు, గ్యారేజీలు, సబ్‌వే స్టేష్టన్లలోకి వెళ్లి తల దాచుకున్నారు. తూర్పు ఖార్కివ్‌లోని గ్యాస్‌ పైప్‌లైన్‌నూ రష్యా పేల్చేసింది.

ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా, కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుక్రెయిన్ పై యుద్ధం ఆపడం లేదు. రోజురోజుకి దాడులను మరింత ఉధృతం చేస్తోంది. యుక్రెయిన్ పై యుద్ధం గురించి తాజాగా రష్యా కీలక ప్రకటన చేసింది. ల‌క్ష్యం చేరేదాకా వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని ర‌ష్యా సంచ‌ల‌న ప్ర‌కట‌న చేసింది. ర‌ష్యా నిర్దేశించుకున్న‌ల‌క్ష్యం నెర‌వేరే దాకా యుక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేదే లేద‌ని ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ చెప్పారు. తాము నిర్దేశించుకున్న ల‌క్ష్యాల‌ను సాధించే వరకు ర‌ష్యా సాయుధ ద‌ళాలు ప్ర‌త్యేక సైనిక చ‌ర్య‌ను కొన‌సాగిస్తాయ‌ని ఆయ‌న చెప్పారు.