జైల్లో అందరూ తినే భోజనమే చిదంబరం తినాలి..ఢిల్లీ హైకోర్టు

  • Published By: venkaiahnaidu ,Published On : September 12, 2019 / 12:25 PM IST
జైల్లో అందరూ తినే భోజనమే చిదంబరం తినాలి..ఢిల్లీ హైకోర్టు

Updated On : September 12, 2019 / 12:25 PM IST

INX మీడియా కేసులో కాంగ్రెస్ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిదంబరం తీహార్ జైల్లో ఉన్న కస్టడీలో ఉన్న విసయం తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న చిదంబరానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఇంటి భోజనానికి అనుమతివ్వాలన్న చిదంబరం విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అందరికి ఇచ్చే ఆహారాన్నే ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. 

చిదంబరం రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ(సెప్టెంబర్-12,2019) ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. చిదంబరానికి ఇంటి నుంచి వండి తెచ్చిన ఆహారాన్ని అందించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన తరపు లాయర్ కపిల్ సిబల్ కోరగా జస్టిస్ సురేష్ కుమార్ కైత్ తిరస్కరించారు. అయితే చట్టం ముందు అందరూ సమానమే అని.. తీహార్ జైల్లో అందరికీ ఎలాంటి ఆహారం అందిస్తారో, అదే ఆహారాన్ని చిదరంబరానికి అందిస్తారని కోర్టు స్పష్టంచేసింది.

కోర్టు వ్యాఖ్యలపై కలగజేసుకున్న కపిల్ సిబల్.. చిదంబరానికి 74 ఏళ్లని, ఆయన విజ్ఞప్తిని పరిశీలించాలని మరోసారి కోరారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఐఎన్‌ఎల్డీ నాయకుడు ఓం ప్రకాశ్ చౌతాలా ఇంతకన్నా పెద్దవయస్సు వారైనప్పటికి రాజకీయ ఖైదీగా ఉన్నారన్నారు. తోటి ఖైదీలకు పెట్టే భోజనాన్నే.. ఆయనా తింటున్నారని తెలిపారు.