Monkeypox : యూపీలో ఐదేళ్ల చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు
దేశంలో రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ఒక ఐదేళ్ల చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం ఆందోళన కలిగిస్తోంది.

monkeypox
Monkeypox : దేశంలో రోజు రోజుకు కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని ఒక ఐదేళ్ల చిన్నారికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం ఆందోళన కలిగిస్తోంది.
ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఐదేళ్ల చిన్నారికి శరీరంపై దద్దుర్లు, బొబ్బలు రావటంతో ఆమె తల్లి తండ్రులు బాలికను ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు బాలికను ఐసోలేషన్ లో ఉంచి చిన్నారి నమూనాలను పరీక్షకు పంపించారు. ఇది కేవలం ముందు జాగ్రత్త చర్యే అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఘజియాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు.
చిన్నారికి ఎలాంటి ఇతర ఆరోగ్య సమస్యలు లేవు అని.. ఆమె కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ గత నెల రోజులుగా విదేశీ పర్యటనలు ఏవీ చేయలేదని అధికారులు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలలో 700 మందికి మంకీ పాక్స్ సోకినట్లు తెలుస్తోంది. అమెరికాలోని 11 రాష్ట్రాల్లో 21 కేసులు బయటపడగా కెనడాలో 77 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో భారత ప్రభుత్వం ముందస్తుగా మంకీపాక్స్ ను గుర్తించటానికి వ్యాధి నిర్ధారణపై మార్గదర్శకాలను జారీ చేసింది.
Also Read : AP SSC Results 2022 Postponed: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల వాయిదా.. కారణం ఏమిటంటే..