AP SSC Results 2022 Postponed: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల వాయిదా.. కారణం ఏమిటంటే..

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి-2022 ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించిన అధికారులు చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 11గంటల వరకు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూసిన విద్యార్థులు..

AP SSC Results 2022 Postponed: ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల వాయిదా.. కారణం ఏమిటంటే..

1oth Result

AP SSC Results 2022 Postponed: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి-2022 ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించిన అధికారులు చివరి నిమిషంలో ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 11గంటల వరకు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారుల నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే పదవ తరగతి ఫలితాలు తిరిగి సోమవారం వెల్లడిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

10th Exams: ప్రశ్నాపత్రం లీక్ వార్తలు అవాస్తవం: మంత్రి బొత్స

షెడ్యూల్ ప్రకారం.. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ శనివారం ఫలితాలను విడుదలచేయాల్సి ఉంది. 2021-2022 ఏడాదికిగాను ఏప్రిల్ 27 నుంచి మే 9వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి పదవ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయడం ఇదే తొలిసారి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పరీక్షలు జరగలేదు. రెండేళ్లుగా టెన్త్ విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఇంటర్ కు ప్రమోట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిసారి టెన్త్ పరీక్షలు నిర్వహించడంతో పాటు 25 రోజుల్లోనే పరీక్షా ఫలితాలు విడుదల చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఇందుకోసం శనివారం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. కానీ చివరి నిమిషంలో ఫలితాలు వాయిదా వేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం సాంకేతిక సమస్య తలెత్తడం వల్లనే ఫలితాలనువ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.