Sanjay Leela Bhansali : వేశ్యలపై సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్

‘దేవదాస్’, ‘బాజీరావ్ మస్తానీ’ ‘పద్మావత్’ వంటి గొప్ప చిత్రాలను నిర్మించిన సంజయ్ లీలా భన్సాలీ తన తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించారు. ప్రీ ఇండిపెండెన్స్‌ సెట్ సిరీస్ ‘హీరమండి’ కోసం ఆయన నెటఫ్లిక్స్‌తో కలిసి పని చేయనున్నారు.

Sanjay Leela Bhansali : వేశ్యలపై సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్

Sanjay Leela Bhansali

Updated On : August 10, 2021 / 7:19 PM IST

Sanjay Leela Bhansali : ‘దేవదాస్’, ‘బాజీరావ్ మస్తానీ’ ‘పద్మావత్’ వంటి గొప్ప చిత్రాలను నిర్మించిన సంజయ్ లీలా భన్సాలీ తన తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించారు. ప్రీ ఇండిపెండెన్స్‌ సెట్ సిరీస్ ‘హీరమండి’ కోసం ఆయన నెట్ ఫ్లిక్స్‌తో కలిసి పని చేయనున్నారు. ఇండస్ట్రీకి వచ్చి 25 వసంతాలు పూర్తి చేసుకున్న భన్సాలీ.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.

అలాగే, అక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్‌ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు సమాచారం. భన్సాలీ తన ట్రేడ్‌మార్క్ అయిన పెద్ద పెద్ద సెట్‌లు, బహుముఖ పాత్రలు, మనోహరమైన కూర్పులను మరోసారి ఈ సిరీస్‌లో మన కళ్లను కట్టిపడేయనున్నాయి. ‘హీరమండి’ చిత్ర నిర్మాతగా తన మూవీ జర్నీలో మరో ప్రత్యేకమైన మైలురాయిని భన్సాలీ అందుకోనున్నారు.

‘ఇది ఒక పురాణం. లాహోర్ వేశ్యల మీద ఆధారపడిన తొలి సిరీస్ ఇది. అన్నింటినీ కలిగి ఉండే గొప్ప సిరీస్. కాబట్టే దీన్ని నిర్మించడం పట్ల ఉత్కంఠతో ఉన్నాను. నెట్‌ఫ్లిక్స్‌తో నా భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాను. ‘హీరమండి’ ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాను’ అని భన్సాలీ చెప్పారు.

25 ఏళ్ల క్రితం 1996లో కామోషి సినిమాతో భన్సాలీ తన కెరీర్ ప్రారంభించారు. తన కంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. బ్లాక్, బాజీరావ్ మస్తానీ, గుజారిష్, రామ్ లీలా, దేవ్ దాస్ వంటి బ్లాక్ బస్టర్లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఐదు నేషనల్ ఫిలిమ్ అవార్డులు, ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ సైతం అందుకున్నారు. దేవదాస్ చిత్రానికి గాను బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిమ్ అవార్డు గెల్చుకున్నారు.