Sarvamangala devi : సతీదేవి తొడ భాగం పడిన దివ్యక్షేత్రం .. మంగళగౌరిదేవి శక్తి పీఠం
స్త్రీలు మాంగళ్య రక్షణ కోసం ప్రార్థించేది మంగళగౌరీ తల్లినే. తమ భర్త ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుతూ మంగళగౌరీని పూజిస్తారు. అంతటి విశిష్ట కలిగిన మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇది బీహారు రాష్ట్రంలోని గయలో ఉంది.

Sarvamangala devi shakti peeth In gaya bihar
Sarvamangala devi : వివాహిత మహిళలు, కొత్తగా పెళ్లైన నవ వధువులు ఎంతో ఇష్టంగా మంగళగౌరీ వ్రతాన్ని చేస్తుంటారు. ముఖ్యంగా శ్రవాణమాసంలో మంగళగౌరీని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీ కృష్ణుడే ద్రౌపదికి వివరించినట్లు చెబుతారు. మంగళగౌరీ మన జీవితాలలో పెనవేసుకుపోయిన అమ్మవారు. స్త్రీలు మాంగళ్య రక్షణ కోసం ప్రార్థించేది ఈ తల్లినే. కన్యలు వివాహానికి ముందు మంగళగౌరీ పూజలు చేయడం ఈ నాడే కాదు.. ద్వాపర యుగం నుంచీ వస్తోంది. కొత్తగా పెళ్లయిన స్త్రీలు పెళ్లైన సంవత్సరం నుంచి ఐదేళ్ల పాటు శ్రావణమంగళవారం నోము నోచుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం తమ సంసారం చల్లగా ఉండాలని, సకల శుభాలతో వర్థిల్లాలని, తమ భర్త ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుతూ మంగళగౌరీని పూజిస్తారు.
అంతటి విశిష్ట కలిగిన మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఇది బీహారు రాష్ట్రంలోని గయలో ఉంది. ఇక్కడ అమ్మవారి తొడ భాగం పడ్డదని చెబుతుంటారు. ఇక్కడ సతీదేవిని రొమ్ము రూపంలో పూజిస్తారు. ఇది పోషణకు చిహ్నం. ఈ ఆలయం పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, దేవీ భాగవత పురాణం, మార్కండేయ పురాణం, ఇతర రచనలలో ఈ దేవాలయం ప్రస్తావించబడింది. ప్రస్తుతం వున్న ఆలయం క్రీ.శ. 1459 లో నిర్మించారు. తూర్పు ముఖంగా ఉన్న ఈ ఆలయం మంగళగౌరి కొండపై నిర్మించబడింది. మెట్లు లేదా రహదారి గుండా కొండపైకి చేరుకోవచ్చు. ఆలయం ముందు ఒక చిన్న నాట్య మండపం ఉంది. ప్రాంగణంలో హోమం నిర్వహించడం కోసం హోమ గుండం ఉంది. మంగళగౌరి ఆలయం ఇటుకలతో నిర్మింపబడిన చిన్న ఆలయం. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మంటపం, హోమగుండం ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో శివలింగాకారంలో ఉన్న పరమేశ్వరుడు ఆయనకు ఎదురుగా నంది దర్శనమిస్తారు.. గర్భగుడి చాలా చిన్నగా ఉంటుంది. లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె లాగా వుంటుంది. ఆ దిమ్మె మీద మనం వెలిగించే అఖండ దీపంలాంటిది ఒకటి, ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు ప్రకాశిస్తూ వుంటాయి. గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా వుంది. దానినే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు. ఈ ఆలయం చిన్నది. గర్భగుడి మరీ చిన్నది. ఎలక్ట్రిక్ దీపాలు ఉండక పోవటంతో వెలుతురు కొంచెం తక్కువగా వుంటుంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఆలయ ప్రాంగణంలో ఒక మర్రిచెట్టు ఉంది. సీతమ్మవారు.. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెట్టును దీవించిందంట. అందుకే ఈ చెట్టు కోరికలు తీర్చే అక్షయవృక్షమని అంటారు. ఇక్కడ ప్రతి మంగళవారాలలో అమ్మవారికి విశేష పూజలు, వ్రతాలు చేస్తారు. వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, మహాశివరాత్రి, కార్తీకమాసాలలో విశస్త్రష పూజలు చేస్తారు. ఇంటిని కాపాడే జగన్మాతగా అమ్మవారిని కొలుస్తారు. మంగళగౌరిని పరోపకార దేవతగా పూజిస్తారు. ఈ ఆలయం ఉప-శక్తి పీఠాన్ని కలిగి ఉంది. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
ఈ విశాలమైన దేవాలయం అంతా శిల్పాలతో నిండి ఉంది. ఈ క్షేత్రంలో అమ్మవారిని యంత్రరూపంలో పెద్ద అఖండరూపంలో ,బంగారంతో తయారు చేసిన ముఖం రూపంలో ఉంటుంది. సుమారు 3అడుగుల ఎత్తుగల ద్వారం గుండా గర్బగుడిలోనికి ప్రవేశం ఉంటుంది. అమ్మవారి స్తనములు పోలిన శిలకు పూజలు జరుగుతాయి. ప్రతి మంగళవారంనాడు విశేషంగా అమ్మవారి దర్శనం కొరకు వస్తారు. విజయదశమి, చైత్రమాసంలో విశేష పూజలు, ఉత్సహావాలు జరుగుతాయి.
అమ్మవారి మందిరం ఎదురుగా ఉన్న మండపం నందు హోమాలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీని పక్కనే శివాలయం కూడా ఉంది. మహిళలు ప్రతి శ్రావణ మాసంలోను ఇక్కడ మంగళగౌరి వ్రతములను చేస్తారు. పిండప్రధాన క్షేత్రంగా గయా క్షేత్రం ప్రసిద్ధి చిందినది. సాధారణంగా కాశీక్షేత్ర దర్శనానికి వెళ్ళినవారు గయలో పితృ కార్యాలు నిర్వహించి, మంగళగౌరిని దర్శిస్తారు. అలాగే ప్రయాగలో త్రివేణీ సంగమ స్నానం, వేణీ దానం, చేసి అక్కడ వెలిసిన మరో శక్తి పీఠం మాధవేశ్వరిని దర్శించుకుని తరిస్తారు.