Madhaveswari devi : దాక్షాయణి అమ్మవారి కుడిచేతి వేళ్ళు పడిన పుణ్యక్షేత్రం .. శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం.

అష్టాదశ శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠమే ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాదులో ఉన్న శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం. ఇక్కడ దాక్షాయణి అమ్మవారి కుడిచేతి వేళ్ళు పడ్డాయని చెబుతారు. ఈ శక్తిపీఠం విలక్షణమైనది. ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భక్తులు పూజిస్తారు. ఈ శక్తి పీఠంలో విగ్రహారాధన ఉండదు.

Madhaveswari devi : దాక్షాయణి అమ్మవారి కుడిచేతి వేళ్ళు పడిన పుణ్యక్షేత్రం .. శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం.

Madhaveswari devi Shakthi Peetham

Madhaveswari devi Shakthi Peetham :  విగ్రహమే లేని ఆలయం.. దాక్షాయణీ అమ్మవారు వెలసిన అత్యంత పవిత్రమైన ప్రదేశం.. స్వయంగా శ్రీరాముడే అమ్మను ఆరాధించిన దివ్యక్షేత్రం.. అదే అలహాబాద్‌లో ఉన్న శక్తి పీఠం.. మహాశక్తి స్వరూపిణీ అయిన అమ్మవారిని ఇక్కడ శ్రీమాధవేశ్వరీ దేవిగా కొలుస్తారు.

అష్టాదశ శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠమే ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని అలహాబాదులో ఉన్న శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం. ఇక్కడ దాక్షాయణి అమ్మవారి కుడిచేతి వేళ్ళు పడ్డాయని చెబుతారు. ఈ శక్తిపీఠం విలక్షణమైనది. ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భక్తులు పూజిస్తారు. ఈ శక్తి పీఠంలో విగ్రహారాధన ఉండదు. 4 దిక్కులా సమానంగా కట్టిన పీఠం మాత్రం ఉంటుంది. దానిమీద వస్త్రాన్ని హుండీలా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధన చేసి అమ్మవారిని కొలుచుకున్నట్లుగా భావిస్తారు. కానుకలను ఉయ్యాలలో ఉంచుతారు. ఇలా విగ్రహారాధన లేని శక్తి పీఠం భారత దేశంలో ఈ క్షేత్రం ఒక్కటే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక్కడ సతీదేవిని అలోపీ మాత, అలోపి శాంకరీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బింధు మాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమని.. సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరిస్తారు. శ్రీరామ చంద్రుడు కూడా ఈ మాతను ఆరాధించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తన తమ్ముడైన లక్ష్మణుడు, భార్య సీతతో చిత్రకూటంలోని పర్ణశాల నిర్మించడానికి ముందు ప్రయాగలో కొద్ది రోజుల పాటు ఉన్నాడు రాముడు. అదే సమయంలో ఈ మాతను కొలిచాడని చెబుతారు. మరో జానపద కథనం కూడా ఈ క్షేత్రానికి ఉంది. పూర్వం ఈ ప్రాంతమంతా ఓ దట్టమైన అరణ్య ప్రదేశంగా ఉండేది. అలోపి అనే రాణి పెళ్లి చేసుకొని ఈ మార్గంలోనే అత్తవారింటికి కాపురానికి వెళ్తూ ఉంటుంది. ఆమె ప్రయాణిస్తున్న పల్లకి ప్రయాగ వద్దకు రాగానే దోపిడి ముఠా ఈ బృందంపై దాడి చేసి దోచుకుంటుంది. అప్పుడు పెళ్ళికూతురు అయిన రాణి.. అమ్మవారిని ప్రార్ధించగా, ఆవిడ పెళ్ళికూతురుని మాయంచేసి, ఆ దొంగలబారినుండి రక్షించిందట. ఆనాటినుంచి ఆ దేవిని అలోపీదేవిగా పిలుస్తున్నారు. అలోపీ అంటే మాయమవటం అని అర్ధం. అప్పటినుంచీ ఇక్కడివారు పెళ్ళిళ్ళకి ముందు ఈ అమ్మవారిని పూజించిన తర్వాతే శుభకార్యం మొదలు పెడతారు.

Kamakhya Devi : జననాంగాన్ని పూజించే ఆలయం .. నెలలో మూడుసార్లు ఋతుస్రావం జరిగే కామాఖ్యదేవి పుణ్యక్షేత్రం

జీవసృష్టి జరగడానికి ముందు ఇక్కడ బ్రహ్మ అనేక యాగాలు చేశాడట. అందుకే దీనికి ప్రయాగ అనే పేరు వచ్చింది. ప్ర అంటే గొప్ప.. అని అంటే యాగమని అర్థం. గంగా, యుయున, సరస్వతి నదుల కూడలి ప్రదేశమే ప్రయాగ. మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రయాగను అలహాబాద్ గా పేరు మార్చారు. ఈ మూడు నదుల సంగమాన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఈ సంగమంలో స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. కాశీ తీర్ధయాత్ర చేసినవారు, ప్రయాగ లో త్రివేణీ సంగమ స్నానం తప్పక ఆచరిస్తారు. ఇక్కడ వెలిసిన మాధవేశ్వరీదేవి ఆలయాన్ని దర్శిస్తారు. అలాగే ఈ యాత్ర చేసినవారు గంగా తీర్ధం ఈ త్రివేణీ సంగమంనుంచి మాత్రమే ఇంటికి తీసుకు వెళ్ళాలి. ప్రయాగనే అలహాబాద్ అని కూడా అంటారు. పౌరాణికంగానేకాక చారిత్రకంగాకూడా పేరు చెందిన ప్రదేశం ఇది. ఇక్కడ పవిత్ర స్నానాలు చేసి పెద్దలకు శ్రాద్ధకర్మలు కూడా నిర్వహిస్తారు. ఇందుకోసం దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వేలది మంది నిత్యం వస్తుంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళ జరుగుతుంది. ఆసమయంలో ఇసుకేస్తే రాలనంత మంది జనం ఇక్కడికి వస్తుంటారు. గంగ, యమున నదులు కలిసే చోట రెండు రంగుల్లో నీళ్లు కనిపిస్తాయి. నల్లగాను, ఎర్రగాను కనిపించే ఈ నీళ్లు కలిసే ప్రాంతంలో లోతు తక్కువగా ఉంటుంది. ప్రవేశ వేగం కూడా తక్కువగానే ఉంటుంది. భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు చేయడం కోసం పడవల్లో వెలుతూ ఉంటారు.