SBI కొత్త ఆప్షన్ : కార్డు లేకుండా ATM నుంచి విత్ డ్రా

  • Published By: madhu ,Published On : March 16, 2019 / 03:09 AM IST
SBI కొత్త ఆప్షన్ : కార్డు లేకుండా ATM నుంచి విత్ డ్రా

Updated On : March 16, 2019 / 3:09 AM IST

ఏటిఎమ్‌ కార్డు లేకుండా ఏటిఎమ్‌  డబ్బులు డిపాజిట్ చేయవచ్చు. ఎస్‌బీఐ ఏటిఎమ్‌లలో ఇటువంటి సౌకర్యం ఉంది. అయితే ఏటిఎమ్‌ కార్డు లేకుండా డబ్బులు తీసుకోవచ్చా? యస్.. ఈ అవకాశం ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఇస్తుంది. ఎస్‌బీఐ తమ డిజిటల్‌ బ్యాంకింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ యోనోపై ద్వారా ‘యోనో క్యాష్‌’ పేరుతో ఈ అవకాశాన్ని కలిగిస్తుంది. 
Read Also :PubG ఫ్యాన్స్ రిలాక్స్: గేమ్ బ్యాన్ చేయడం అంత ఈజీ కాదు!
-యోనో క్యాష్‌తో దేశవ్యాప్తంగా ఉన్న 16,500కు పైగా ఎస్‌బీఐ ఏటిఎమ్‌లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 
-‘యోనో క్యాష్‌’  ద్వారా అన్నీ ఏటిఎమ్‌లలో కార్డు లేకుండా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
-16 వేల 500 ఏటిఎమ్‌లలో మొదట ఈ అవకాశం ఉండగా వాటిని 60వేలకు త్వరలో ఎస్‌బీఐ పెంచనుంది.
-ఈ యోనో యాప్ ద్వారా డబ్బు తీసుకోవాలంటే యాప్‌ ద్వారా డబ్బు తీసుకునేందుకు మొదట నమోదు చేసుకోవాలి.
– ఆ యోనో యాప్‌కు ముందే ఒక ఆరు అంకెల సెక్యురిటీ పిన్‌ను పెట్టుకోవాలి 
– ఆ పిన్‌ను ఎంటర్ చేయగానే ఒకవేళ డబ్బు అకౌంట్‌లో ఉంటే ఆరు అంకెల ఓటీపీ నంబర్‌ను బ్యాంక్‌ అకౌంట్‌కు లింక్ చేసిన నంబర్‌కు పంపిస్తారు. 
– ఆ ఓటీపీ ఎటిఎమ్ సెంటర్‌లలో ఎంటర్ చేసిన వెంటనే మనకు డబ్బు ఏటిఎమ్ నుండి వస్తుంది.
– ఓటీపీని 30నిమిషాలలో ఎంటర్ చేయవలసి ఉంటుంది. 30 నిమిషాలలో చేయకుండా ఓటీపీ ఎక్స్‌పైర్ అయిపోతుంది
డెబిట్ కార్డుల ద్వారా చలామనిని తగ్గించాలనే ఆలోచనతో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్‌బీఐ చెప్పింది. కార్డును జేబుల్లో పెట్టుకుని అవి పాడయితే ఏటీఎమ్ కార్డు ద్వారా డబ్బులు తీసుకోవడానికి కష్టం అవుతున్నదని ఇబ్బంది పడేవారికి ఈ నిర్ణయం మేలు చేస్తుందని భావిస్తున్నారు. ఇటువంటి సేవలను ఉపయోగించిన తొలి బ్యాంకు ఎస్‌బీఐ అని ఆ బ్యాంకు అధికారులు తెలిపారు.
Read Also : మన బడ్జెట్ లో : రూ.10వేల లోపు.. టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే..