NDA exam: ఎన్డీఏ పరీక్షలు రాయనున్న మహిళలు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
సాయుధ దళాలలో పురుషులు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.

Supreme Court
SC slams Centre: సాయుధ దళాలలో పురుషులు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్షను మహిళలు కూడా రాయొచ్చని, సెప్టెంబరు 5వ తేదీన జరిగే ఎన్‌డీఏ పరీక్షల్లో మహిళలకు అవకాశం కల్పించాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో భద్రతా బలగాల్లో మహిళల సంఖ్య పెరగే అవకాశం కనిపిస్తొంది.
సుప్రీంకోర్టు ఆదేశాలతో పురుషులు మాత్రమే చేరగలిగే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA) లో ప్రవేశానికి ఇకపై మహిళలకు కూడా అనుమతి లభిస్తుంది. ఈ సంధర్భంగా కేంద్రం అభిప్రాయలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సాయుధ దళాలలో పురుషులు, మహిళలకు సమాన అవకాశాల విషయంలో ప్రభుత్వం ఆలోచనా విధానం మారాలని హెచ్చరించింది. తమ ఆదేశాలను బలవంతంగా భావించకుండా ఆర్మీలో స్వీయ మార్పు తీసుకుని రావాలని, తీసుకుని వస్తారని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది.
విధానపరమైన నిర్ణయం లింగ వివక్షపై ఆధారపడి ఉంటుందని, కోర్టు తీర్పును దృష్టిలో పెట్టుకుని, నిర్మాణాత్మక అభిప్రాయాలను తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. స్వయంగా ఆర్మీ నిర్ణయం తీసుకునేలా ఒప్పించడమే మా ప్రయత్నమని, ఈ విషయంలో హుకుం జారీ చేయడం కంటే ఆర్మీనే వారిని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేస్తే మేము సంతోషిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది.
అయితే, NDAకు సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలలో ప్రవేశానికి పరీక్ష తేదీని ప్రకటిస్తూ UPSC జూన్ 9, 2021న నోటీసు జారీ చేసింది. “05.09.2021 న పరీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు సమాన అవకాశాల విషయమై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టస్ అజయ్ రస్తోగి గతేడాది తీర్పు సహా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం ప్రస్తావించింది.