Vadodara : విషాద‌యాత్ర‌.. ప‌డ‌వ బోల్తా.. 14 మంది మృతి.. మృతుల్లో 12 మంది విద్యార్థులు

గుజ‌రాత్ రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది.

Vadodara : విషాద‌యాత్ర‌.. ప‌డ‌వ బోల్తా.. 14 మంది మృతి.. మృతుల్లో 12 మంది విద్యార్థులు

School children feared dead after picnic boat capsizes in Vadodara lake

Updated On : January 18, 2024 / 8:24 PM IST

గుజ‌రాత్ రాష్ట్రంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. వ‌డోద‌ర‌లోని హ‌ర్ని స‌ర‌స్సులో ప‌డ‌వ బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది మ‌ర‌ణించారు. ప్ర‌మాద స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 27 మంది విద్యార్థులు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. ఓ ప్రైవేటు పాఠ‌శాల‌కు చెందిన 27 మంది విద్యార్థులు గురువారం విహార‌యాత్రకు వ‌చ్చారు. మ‌ధ్యాహ్న స‌మ‌యంలో హ‌ర్ని స‌ర‌స్సులో ఓ ప‌డ‌వ‌లో వెలుతుండ‌గా వారు ప్ర‌యాణిస్తున్న ప‌డ‌వ బోల్తా ప‌డింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది, గ‌జ ఈత‌గాళ్లు రంగంలోకి దిగారు. ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది మృత‌దేహాల‌ను వెలికితీశారు. మ‌రో 10 మందికి పైగా విద్యార్థుల‌ను కాపాడారు. గ‌ల్లంతైన మిగిలిన విద్యార్థుల గాలింపు చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నారు.

Viral Video : సివిల్‌ సర్వీసులకు సిద్ధమవుతున్నవిద్యార్థి గుండెపోటుతో మృతి.. కోచింగ్ క్లాస్‌లో..

మ‌ర‌ణించిన 14 మందిలో 12 మంది విద్యార్థులు కాగా మ‌రో ఇద్ద‌రు ఉపాధ్యాయులు ఉన్న‌ట్లు గుజ‌రాత్ రాష్ట్ర హోం మంత్రి హ‌ర్ష్ సంఘ్వీ తెలిపారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే మంత్రి ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

కెపాసిటీ కంటే ఎక్కువ‌గా..

ప్ర‌మాదానికి బోటు కాంట్రాక్ట‌ర్ త‌ప్పిద‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు. బోటులో కెపాసిటీ కంటే ఎక్కువ మంది పిల్ల‌ల‌ను ఎక్కించార‌న్నారు. వారితో పాటు ప‌లువురు ఉపాధ్యాయులు కూడా ఉన్నార‌న్నారు. త‌క్ష‌ణ‌మే స‌ద‌రు కాంట్రాక్ట‌ర్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సీఎం దిగ్భ్రాంతి..

ఈ ఘ‌ట‌న‌పై గుజ‌రాత్ సీఎం భూపేంద్ర పటేల్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఘ‌ట‌న గురించి తెలుసుకున్న వెంట‌నే ఆయ‌న అన్ని కార్య‌క్ర‌మాలు ర‌ద్దు చేసుకుని వ‌డోద‌ర బ‌య‌లు దేరారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రంగా చేప‌ట్టాల‌ని, విద్యార్థుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మృతుల కుటుంబాల‌కు రూ.4ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు.

Punjab : ప్రియురాలి కోసం గెట‌ప్ మార్చావు స‌రే.. అస‌లు విష‌యం మ‌రిచిపోయావుగా..!