School Holidays in October : విద్యార్థులకు పండగే.. అక్టోబర్‌లో స్కూళ్లకు సెలవులే సెలవులు.. మొత్తం హాలీడేస్ ఎన్ని రోజులంటే? ఫుల్ లిస్ట్ ఇదిగో..!

School Holidays in October 2025 List
School Holidays in October 2025 List : అక్టోబర్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు ఉన్నాయి. ఈ నెలలో వరుస పండుగలు, ప్రభుత్వ సెలవులతో స్కూళ్లు పనిచేయవు. గాంధీ జయంతి, దసరా, దీపావళి, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వంటి ప్రధాన పండుగల కారణంగా పాఠశాలలు చాలా రోజులు హాలీడేస్ ఉంటాయి.
ఇందులో ఆదివారం, శనివారం వారాంతం సెలవులు (School Holidays in October 2025 List) కూడా ఉన్నాయి. ఇంతకీ అక్టోబర్ నెలలో ఏయే రోజుల్లో పండగలు ఉన్నాయి.. ప్రభుత్వ సెలవులతో కలిపి మొత్తం ఎన్ని రోజులు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అక్టోబర్‌లో ఏయే రోజుల్లో సెలవులంటే? :
ఈ ఏడాదిలో అక్టోబర్ నెలలో మొత్తం 4 ఆదివారాలు ఉన్నాయి. 5, 12, 19, 26 తేదీలు ఉన్నాయి. అదనంగా, అక్టోబర్ 2న గాంధీ జయంతికి సెలవు ఉంటుంది. ఆసక్తికరంగా, దసరా కూడా అక్టోబర్ 2న వస్తుంది. రెండో, నాల్గో శనివారాల్లో సెలవులు ఉన్న స్కూళ్లకు అక్టోబర్ 11, అక్టోబర్ 25 తేదీలలో కూడా సెలవులు ఉంటాయి.
తెలుగు రాష్టాల్లో స్కూళ్లకు సెలవులు :
సెప్టెంబర్ 22, 2025 సోమవారం నుంచి ఏపీ, తెలంగాణ స్కూళ్లకు దసరా సెలవులు ఉంటాయి. మొత్తం 11 రోజులు పాఠశాలలు మూడతపడతాయి. ఇప్పుడు, అక్టోబర్ 3న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. వాస్తవానికి, దసరా సెలవుల తేదీలను సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్ణయించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు 9 రోజుల విరామం లభించింది. పండగ సెలవులు పెంచాలనే డిమాండ్ మేరకు మరో మూడు రోజులు సెలవులు ప్రకటించడంతో మొత్తం 12 రోజులు స్కూళ్లకు సెలవులు ఉంటాయి.
అక్టోబర్ 2025 స్కూళ్లకు సెలవులివే :
- అక్టోబర్ 2: గాంధీ జయంతి, దసరా
- అక్టోబర్ 5: ఆదివారం
- అక్టోబర్ 11: రెండో శనివారం (కొన్ని స్కూళ్లకు సెలవు)
- అక్టోబర్ 12: ఆదివారం
- అక్టోబర్ 19: ఆదివారం
- అక్టోబర్ 20: దీపావళి
- అక్టోబర్ 22: గోవర్ధన పూజ
- అక్టోబర్ 23: భాయ్ దూజ్
- అక్టోబర్ 25: నాల్గో శనివారం
- అక్టోబర్ 26: ఆదివారం
- 27 అక్టోబర్: లాలై చాత్
- అక్టోబర్ 28: ఛఠ్ పూజ
ఈ ఏడాదిలో దీపావళి అక్టోబర్ 20, 2025 (సోమవారం)న జరుపుకుంటారు. అంతకన్నా ముందే అక్టోబర్ 19న ఆదివారం సెలవు. ఆ తర్వాత సోమవారం దీపావళి సెలవు ఉంటుంది. ఆపై అనేక స్కూళ్లకు వరుసగా సెలవులు రావచ్చు. అక్టోబర్ 22న గోవర్ధన పూజ, అక్టోబర్ 23న భాయ్ దూజ్ జరుపుకుంటారు. ఈ అక్టోబర్ నెలలో ఎక్కువ మొత్తం విద్యార్థులు సెలవులతోనే గడిపేస్తారు.
తప్పక గుర్తుంచుకోండి :
దేశంలోని స్కూల్ హాలిడేస్ క్యాలెండర్ అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా ఉండదు. సెలవుల షెడ్యూల్ రాష్ట్రం నుంచి రాష్ట్రానికి నగరానికి మారవచ్చు. సెలవులు కొన్నిసార్లు స్థానిక వాతావరణ పరిస్థితులు లేదా ప్రత్యేక ప్రభుత్వ ప్రకటనలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల, తల్లిదండ్రులు తమ పిల్లల స్కూళ్లలో కచ్చితమైన సెలవుల వివరాలను చెక్ చేసుకోవడం బెటర్.