సెల్ ఫోన్‌తో కరోనా టెస్ట్.. 60సెకన్లలో రిజల్డ్

ప్రపంచానికి పట్టిన భూతం ఈ కరోనా వైరస్ మహమ్మారి. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు సైంటిస్టులు తలలు పట్టుకుంటున్నా సక్సెస్ కాలేకపోతున్నారు. Covid-19 కొత్త లక్షణాలతో రోజురోజుకూ మితిమీరిపోతుంది. మందు ఎలాగూ కనిపెట్టలేదు కాబట్టి కనీసం జాగ్రత్తలైనా ముమ్మరం చేయాలని ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ సాయంతో కరోనాను గుర్తించడంపై కసరత్తులు మొదలుపెట్టారు.
ఇటీవల ఓ ప్రైవేట్ కంపెనీ కనిపెట్టిన టెక్నిక్ తో 60సెకన్లలోనే కరోనా వైరస్ ను గుర్తించవచ్చట. అమెరికాలోని Utah యూనివర్సిటీ సైంటిస్టులు ఓ డివైజ్ ను కనిపెట్టారు. దీనిని స్మార్ట్ ఫోన్ కు లింక్ చేయాలి. సెలైవా శాంపుల్స్ తీసి డివైజ్ మీద పెడితే 60 సెకన్లలో కరోనా వైరస్ ఫలితాన్ని చెప్పేస్తుంది. టెక్నాలజీతో తయారైన ఈ సెన్సార్ ను జికా వైరస్ కనుగొనడానికి డివైజ్ తయారుచేసిన అదే టీం రూపొందించింది.
ఈ సెన్సార్ సింగిల్ స్ట్రాండ్ DNA ఆప్టామెర్స్.. కొవిడ్ 19 వైరస్ ప్రొటీన్లతో లింక్ అయి ఉంటుంది. యూజర్స్ ఈ సెన్సార్ ను ప్లగ్ లో పెట్టి సెల్ ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసి ఆపరేట్ చేయొచ్చు. వైరస్ ఉందో లేదో తెలుసుకోవడానికి యూజర్ తన సెలైవాలోని ఓ చుక్కను సెన్సార్ పై వేస్తే ఫోన్లో రిజల్ట్ కనిపిస్తుంది. ముక్కులో శ్లేష్మం వేసి కూడా ఫలితాన్ని రాబట్టొచ్చని రీసెర్చర్స్ అంటున్నారు.
కొవిడ్ 19 పాజిటివ్ అయితే డీఎన్ఏ అనే సెన్సార్ పై వైరస్ ప్రొటీన్లతో, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ కలిసి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఈ సెన్సార్ లో చాలా చిన్న పరికరాలు ఉంటాయి. ఒక్కోదానికి DNAపలు రకాలుగా ఉండటమనేది డిఫరెంట్ ప్రొటీన్ లా అనిపిస్తుంది. ఇటువంటి ప్రత్యేకమైన కాంబినేషన్ అనేది Covid-19 మాత్రమే అని కనిపెట్టేయొచ్చు.
Read: చైనా సైనికులు భారత్‌లోకి రాకపోతే ఇండియా సైనికులు ఎందుకు చనిపోయినట్లు: చిదంబరం