Madhya Pradesh Polls: 1200 కార్లతో ర్యాలీగా వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత

మాల్వా నిమార్ ప్రాంతంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తర్వాత అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా సమందర్ పటేల్ ఉన్నారు. రావు అసెంబ్లీ నియోజకవర్గంలోని లింబోడి భాగం ఇండోర్ రూరల్ పరిధిలోకి వచ్చినప్పుడు సమందర్ పటేల్ ఈ గ్రామ పంచాయతీ నుంచి 4 సార్లు సర్పంచ్ అయ్యారు

Madhya Pradesh Polls: 1200 కార్లతో ర్యాలీగా వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నేత

Updated On : August 21, 2023 / 10:20 PM IST

MP Assembly Elections: మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఒక బీజేపీ నేత సుమారు 1200 కార్లతో ర్యాలీగా వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్ది రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ చేరిక పెద్ద రాజకీయ చర్చకు దారి తీసింది. ఆ నాయకుడి పేరు సమందర్ పటేల్. రౌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు గట్టి మద్దతుదారుడు కూడా. సమందర్ పటేల్ వందలాది వాహనాల కాన్వాయ్ తో రాజధాని భోపాల్ చేరుకుని కమల్ నాథ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Maharashtra Politics: మత్య్సకారుల సమావేశంలో ఐశ్వర్య రాయ్‭ పేరెత్తిన మంత్రి.. వివాదం లేవనెత్తిన విపక్షాలు

కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చిన సమందర్ పటేల్ బీజేపీని దూషిస్తూ బీజేపీ అవినీతమయమైందని అన్నారు. బీజేపీలో టిక్కెట్ల నుంచి సంస్థలో పదవుల వరకు వేలం వేస్తున్నారని, తన కార్యకర్తలను అవమానిస్తూ పదుల సంఖ్యలో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కమల్ నాథ్ ప్రభుత్వ ఉద్దేశం నుంచి ప్రేరణ పొందిన తర్వాత మాత్రమే తాను తిరిగి సొంత గూటికి (కాంగ్రెస్) వచ్చానని చెప్పారు. 20 ఏళ్లలో రాష్ట్రంలో అన్యాయం, అవినీతి తారాస్థాయికి చేరుకుందని, జవాద్ నుంచి పార్టీ ఎవరు కోరుకున్నా వారిని గెలవడానికి దోహదం చేస్తానని వాగ్దానం చేశారు.

Madhya Pradesh Polls: బీజేపీ ఏ హామీ ఇస్తుందో ముందే చేప్పేస్తున్న కాంగ్రెస్

మాల్వా నిమార్ ప్రాంతంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తర్వాత అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా సమందర్ పటేల్ ఉన్నారు. రావు అసెంబ్లీ నియోజకవర్గంలోని లింబోడి భాగం ఇండోర్ రూరల్ పరిధిలోకి వచ్చినప్పుడు సమందర్ పటేల్ ఈ గ్రామ పంచాయతీ నుంచి 4 సార్లు సర్పంచ్ అయ్యారు. 1994 నుంచి 2015 వరకు నిరంతరం సర్పంచ్‌గా ఉన్నారు. 2018 నాటి ఆయన ప్రొఫైల్ ప్రకారం.. వ్యవసాయం సహా ఇతర ఆస్తులు కలిపి 90 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు.