Sabarimala : ప్రత్యేక రైళ్లలో కర్పూరం వెలిగించవద్దు

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు సూచనలు పాటించాలని వెల్లడించింది. శబరిమలకు వెళ్లే భక్తులు రైళ్లలో హరతి ఇవ్వడం లాంటివి...

Sabarimala : ప్రత్యేక రైళ్లలో కర్పూరం వెలిగించవద్దు

Sabari

Updated On : December 16, 2021 / 11:14 AM IST

Sabarimala Passenger : ప్రత్యేకంగా వెళ్లే రైళ్లలో కర్పూరం వెలగనీయవద్దని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రైళ్లలో మండే స్వభావం ఉండే వస్తువులను అస్సలు తీసుకెళ్లవద్దని, అతిక్రమిస్తే…మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తామని, అంతేగాకుండా వేయి రూపాయల జరిమాన విధించడం జరుగుతుందని హెచ్చరించింది. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు సూచనలు పాటించాలని వెల్లడించింది. శబరిమలకు వెళ్లే భక్తులు రైళ్లలో హరతి ఇవ్వడం లాంటివి చేయకూడదని, భక్తులు జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.

Read More : Groom Escape : మరో గంటలో పెళ్లి.. రూ. 25 లక్షలు, 25 తులాల బంగారంతో పారిపోయిన వరుడు!

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 25వేల మంది భక్తులను అనుమతిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు…పండుగలు, అయ్యప్ప భక్తుల దృష్ట్యా శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్-కొల్లాం మధ్య అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 17న సికింద్రాబాద్ నుంచి కొల్లాం స్టేషన్ కు 07109 నెంబర్ రైలు బయల్దేరనుంది. డిసెంబర్ 19న కొల్లాం నుంచి సికింద్రాబాద్ కు 07110 నెంబర్ రైలు బయల్దేరనుంది.

Read More : Virat Kohli: ‘కోహ్లీ అలా చెప్పి ఉండకూడదు.. సెప్టెంబరులోనే అడిగాం’

డిసెంబర్ 10న ఉదయం 8 గంటలకు 07109 నెంబర్ రైలుకు రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రత్యేక రైళ్లు.. చర్లపల్లి, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పడి, జోలార్ పెట్టై, సేలం, ఈరోడ్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిశూర్, ఎర్నాకులం, కొట్టాయం, చెంగన్ చెరి, తిరువళ్ల, చెంగనూరు, మావలికర, కయాంకులం రైల్వే స్టేషన్ల మీదుగా వెళ్లనున్నాయి.