3కోట్ల రేషన్ కార్డులు రద్దు..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

Scrapping 3 Crore Ration Cards For Not Linking Aadhaar Too Serious Supreme Court
Ration Cards ఆధార్ కార్డుతో లింకు కాని రేషన్ కార్డులను కేంద్రం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ చర్య మరీ దారుణంగా ఉందంటూ కోర్టు పేర్కొంది. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఆధార్ తో లింక్ లేని కారణంగా కేంద్రం 3 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. నాకు ఈ సమస్య అర్ధమైంది. ఎందుకంటే ఇది వరకు నేను ఈ తరహా కేసును బొంబయి హైకోర్టులో విచారించాను’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే వ్యాఖ్యానించారు.
ఈ పిటిషన్ నిజానికి సంబంధిత హైకోర్టులో దాఖలు చేయాల్సిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుపై త్వరలోనే తుది విచారణ చేపడతామని పేర్కొంది. నాలుగు వారాల్లోగా తదుపరి విచారణపై నోటీసులు జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.