Seema Haider : సచిన్‌ను ‘లప్పు సా’ అన్నందుకు సీమా హైదర్ హెచ్చరిక

తాను ప్రేమించిన భర్త సచిన్ మీనాను లప్పు సా సచిన్ అంటూ వ్యాఖ్యలు చేసిన పొరుగింటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాక్ జాతీయురాలైన అతని భార్య సీమా హైదర్ హెచ్చరించారు. తన భర్త అయిన సచిన్ మీనాను ‘లప్పు సా’, ‘ఝింగుర్ సా’ అని పిలిచినందుకు పొరుగింటి మిథిలేష్ భాటిపై సీమాహైదర్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ చెప్పారు....

Seema Haider : సచిన్‌ను ‘లప్పు సా’ అన్నందుకు సీమా హైదర్ హెచ్చరిక

Seema Haider warns

Updated On : August 16, 2023 / 9:00 AM IST

Seema Haider : తాను ప్రేమించిన భర్త సచిన్ మీనాను లప్పు సా సచిన్ అంటూ వ్యాఖ్యలు చేసిన పొరుగింటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాక్ జాతీయురాలైన అతని భార్య సీమా హైదర్ హెచ్చరించారు. తన భర్త అయిన సచిన్ మీనాను ‘లప్పు సా’, ‘ఝింగుర్ సా’ అని పిలిచినందుకు పొరుగింటి మిథిలేష్ భాటిపై సీమాహైదర్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ చెప్పారు. (Seema Haider warns legal action) సచిన్ మీనాపై పొరుగింటివారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Rudraprayag Bridge collapse : భారీవర్షాలు..కూలిపోయిన రుద్రప్రయాగ్ వంతెన

సచిన్‌ను బాడీ షేమింగ్ చేసినందుకు పొరుగుఇంటి వారిపై పరువు నష్టం కేసు పెట్టవచ్చని లాయర్ ఏపీ సింగ్ చెప్పారు. ఈ బెదిరింపులపై మిథిలేష్ భాటి స్పందిస్తూ, తాను ఎవరినీ కించపరచలేదని చెప్పారు. సచిన్ ను చాలా మంది లప్పి సా అని కూడా పిలుస్తారని, ఈ పదాలు సాధారణంగా అగౌరవం లేకుండా ఉపయోగిస్తుంటామని మిథిలేష్ భాటి వివరణ ఇచ్చారు. ‘‘క్యా హై సచిన్ మే? లప్పు సా సచిన్, ఝింగుర్ సా లడ్కా’’ అని సచిన్ పొరుగింటి వాడైన మిథిలేష్ భాటి ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Yamuna River : ఢిల్లీలో మళ్లీ డేంజర్ మార్కుకు చేరిన యమునా నది

ఈ కామెంటుపై మీమ్ ఫెస్ట్‌ను ప్రారంభించడతో అది కాస్తా వైరల్ అయింది. 5వ తరగతి వరకు చదువుకున్నానని చెప్పుకునే సీమ అక్రమంగా సరిహద్దులు దాటి భారత్‌కు ఎలా వచ్చిందని మిథిలేష్ భాటి ప్రశ్నించారు. మే 13న సీమా భారతదేశంలోకి ప్రవేశించి సచిన్‌తో కలిసి జీవించడానికి గ్రేటర్ నోయిడాకు వచ్చింది. సీమాను పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్ మంజూరు చేశారు.