అమెజాన్ ఫారెస్టులోనా? ఎక్కడ? : కోతిపిల్లను హత్తుకుని విలపిస్తున్న తల్లి కోతి!

అమెజాన్ ఫారెస్టులో మూడు వారాల నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. చనిపోయిన కోతి పిల్లను ఓ తల్లి కోతి హత్తుకుని విలపిస్తున్న ఫొటో. ఈ దృశ్యం..

  • Published By: sreehari ,Published On : August 23, 2019 / 09:22 AM IST
అమెజాన్ ఫారెస్టులోనా? ఎక్కడ? :  కోతిపిల్లను హత్తుకుని విలపిస్తున్న తల్లి కోతి!

Updated On : August 23, 2019 / 9:22 AM IST

అమెజాన్ ఫారెస్టులో మూడు వారాల నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. చనిపోయిన కోతి పిల్లను ఓ తల్లి కోతి హత్తుకుని విలపిస్తున్న ఫొటో. ఈ దృశ్యం..

అమెజాన్ ఫారెస్టులో మూడు వారాల నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఫారెస్టులో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. మిలియన్ల మందికి ప్రాణధారమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్టులో మంటలు చెలరేగడం.. ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రెజిల్‌లోని అతిపెద్ద నగరమైన సావో పాలో సమీపంలోని అమెజాన్ ఫారెస్టులో రాత్రికి రాత్రే మంటలు చెలరేగినట్టు వార్తలు వస్తున్నాయి. అమెజాన్ ఫారెస్టు విషయంలో బ్రెజిల్ ప్రభుత్వం వైఖరిపై ఆరోపణలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీనిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అమెజాన్ ఫారెస్టు దగ్ధమవుతున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

నిజానికి ఈ ఫొటోలు ఇప్పటివి కావు.. దశబ్దాల క్రితం ఫొటోలు. వీటితో పాటు ఓ ఫొటో ప్రతిఒక్కరి హృదయాన్ని కదిలించేలా ఉంది. చనిపోయిన కోతి పిల్లను ఓ తల్లి కోతి హత్తుకుని విలపిస్తున్న ఫొటో. ఈ దృశ్యం.. అమెజాన్ ఫారెస్టులోది అంటూ వైరల్ చేస్తున్నారు. చాలామంది ట్విట్టర్ యూజర్లు కోతి ఫొటోను షేర్ చేస్తున్నారు.

నిజానికి ఈ ఫొటో అమెజాన్ ఫారెస్టులోది కాదు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్‌లో అవినాష్ లోథి అనే భారతీయ ఫొటోగ్రాఫర్ 2017లో తీసిన ఫొటోలు ఇవి. జబల్ పూర్‌లో కోతులను ఫొటో తీస్తున్న సమయంలో లోథి ఈ ఫొటోను తన కెమెరాలో బంధించారు. అవినాష్ చెప్పిన ప్రకారం.. నిజానికి ఆ పిల్ల కోతి చనిపోలేదు. సృహ కోల్పోయింది అంతే.. కానీ, అది చూడటానికి చనిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ఫొటో.. అమెజాన్ ఫారెస్టులోది కాదని తెలిసిపోయింది. 

ఆగస్టు 2015 నుంచి అమెజాన్ బేసిన్ నుంచి ప్రారంభమైన మంటలు.. 9వేల 500లకు పైగా కొత్త ఫారెస్టులకు వ్యాపించి కాల్చిబూడెద చేస్తున్నాయి. చాలా వరకు ఫారెస్టులు మంటల్లో చెలరేగడం 2018 ఏడాది నుంచి భారీగా 83శాతం వరకు పెరిగాయి.