వెంటనే పంపేయండి, ఢిల్లీ మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం, దానికి ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ భవనం కారణం కావడంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులను వెంటనే వారి స్వస్థలాలకు పంపేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది. విమానాల్లో వారిని పంపేయాలంది. విమానాలు లేకపోతే నిర్భంద కేంద్రాలకు పంపాలంది. ఢిల్లీ ప్రార్థనలకు వచ్చిన విదేశీయుల్లో కరోనా వైరస్ లేని వారిని వెంటనే పంపేయాలంది. కరోనా సోకిన వారికి అవసరమైన చికిత్స చేయాలని కేంద్రం చెప్పింది. కాగా, విదేశీయులను తీసుకొచ్చిన సంస్థే.. వారిని తిప్పి పంపే ఖర్చులు భరించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు నిజాముద్దీన్ ప్రాంతంలో ప్రార్థనలకు వెళ్లి ఉండిపోయిన వారి తరలింపుపై అధికారులు దృష్టి పెట్టారు. దాదాపు 2100 మంది వైద్య పరీక్షల కోసం వివిధ ఆసుపత్రులకు తరలించారు.
* ప్రపంచవ్యాప్తంగా 203 దేశాలకు పాకిన కరోనా వైరస్
* ప్రపంచవ్యాప్తంగా 8లక్షల 56వేల 917 కరోనా పాజిటివ్ కేసులు, 42వేల 158 మరణాలు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,78,100
* ఇటీలీలో లక్ష 5వేల 792 కరోనా కేసులు.. 12,428 మరణాలు
* స్పెయిన్ లో 95వేల 923 కేసులు.. 8,464 మరణాలు
* అమెరికాలో లక్ష 87వేల 347 కేసులు, 4వేల మరణాలు
* ఫ్రాన్స్ లో 52వేల 128 కేసులు.. 3,523 మంది మరణాలు
* చైనాలో 81వేల 518 కేసులు… 3,305 మరణాలు
* ఇరాన్ లో 44వేల 605 కేసులు.. 2,898 మరణాలు
* యూకేలో 25వేల 150 కేసులు.. 1,789 మరణాలు
* నెదర్లాండ్ లో 12వేల 595 కేసులు.. 1,039 మరణాలు
* జర్మనీలో 71వేల 808 కేసులు.. 775 మరణాలు
* బెల్జియంలో 12వేల 775 కేసులు.. 705 మరణాలు
* స్విట్జర్లాండ్ లో 433 మంది, టర్కీలో 214 మంది కరోనాతో మృతి
* భారత్ లో 1,637 కు చేరిన కరోనా కేసుల సంఖ్య, 52కి చేరిన కరోనా మరణాలు
* దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 142
* మహారాష్ట్రలో 320 కరోనా కేసులు, 12 మరణాలు
* కేరళలో 241 కేసులు, రెండు మరణాలు
* తమిళనాడులో 124 కేసులు, ఒకరు మృతి
* ఢిల్లీలో 120 కేసులు, ఇద్దరు మృతి
* కర్నాటకలో 101 కేసులు, మూడు మరణాలు
* గుజరాత్ లో 74 కేసులు, ఆరు మరణాలు
* యూపీలో 108 కేసులు
* మధ్యప్రదేశ్ లో 86 కేసులు, నాలుగు మరణాలు
* జమ్ముకశ్మీర్ లో 55 కేసులు, రెండు మరణాలు
* పంజాబ్ లో 41 కేసులు, 4 మరణాలు
* బెంగాల్ లో 32 కేసులు, మూడు మరణాలు
* హరియానాలో 25 కేసులు
* బీహార్ లో 21 కేసులు, ఒకరు మృతి
* చండీగడ్ లో 13, లఢఖ్ లో 13 కేసులు, అండమాన్ లో 10, చత్తీస్ గడ్ లో 9, ఉత్తరాఖండ్ లో 7, గోవాలో 5, ఒడిశాలో 4 కేసులు
* రాజస్థాన్ లో 93 కేసులు
* హర్యానాలో 43 కేసులు
* హిమాచల్ ప్రదేశ్ లో 3 కేసులు, ఒకరు మృతి
* మణిపూర్, మిజోరం, ఝార్ఖండ్, అసోం, పుదుచ్చేరిలో ఒక్కో కేసు నమోదు
* ఏపీలో 58 కరోనా కేసులు
* తెలంగాణలో 97 కరోనా కేసులు, ఆరు మరణాలు, 14మంది డిశ్చార్జ్
Also Read | EMI చెల్లింపులపై బ్యాంకులు ఇస్తున్న ఆప్షన్లు ఇవే!