డిగ్గీరాజా సైటైర్లు : సింధియాకు స్వైన్ ఫ్లూ వచ్చినట్లుంది..మోడీ దగ్గరైనా చల్లగా ఉండు

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరటం ఖరారైపోయింది. కాంగ్రెస్ కు రెబల్ మారటమే కాక తనతో పాటు 17మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరనున్న జ్యోతిరాదిత్యసింధియా కాంగ్రెస్ సీనియర్ నేత సింధియాపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ‘‘మోడీ, షాల నీడన..వారి ప్రాపకంలో చల్లగా ఉండి సింధియా’’ అంటూ సెటైర్లు వేశారు.
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎంపీలో రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. రెండు రోజుల్లోనే పలు కీలక పరిణాలు జరిగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్యా సింధియా, ఆరుగురు మంత్రులతో సహా మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారు.
వీరంతా ప్రత్యేక విమానాల్లో సోమవారం బెంగళూరుకు వచ్చి, రోడ్డు మార్గంలో బెంగళూరు రాజానుకుంటె సమీపంలో ఉన్న ఓ రిసార్టులో చక్కగా కులాసాగా ఉన్నారు. వీరిని సంప్రందించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారు టచ్‌లోకి రావడంలేదు. దీనిపై కూడా డిగ్గీరాజా సెటైర్లు వేశారు. ‘‘జ్యోతిరాదిత్యసింధియాకు స్వైన్ ఫ్లూ వచ్చినట్లుగా ఉంది..అందుకే ఎంత ప్రయత్నించినా మా టచ్ లోకి రావట్లేదు’’ అంటూ సెటైర్లు వేశారు.
మరోవైపు జ్యోతిరాదిత్యకు మద్దతుగా 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామాను ఆమోదిస్తే మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. దాన్ని అలుసుగా తీసుకున్న బీజీపీ జ్యోతిరాదిత్యను తనవైపుకు తిప్పుకోవటం సక్సెస్ అయింది.సింధియా సహకారంతో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ పావులు కదుపుతోంది.
మరోవైపు బెంగళూర్‌లో బస చేసిన రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పలువురు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.కానీ అది జరిగే పనికాదని వారికి కూడా తెలుసు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవటం బీజేపీ కాషాయ జెండా ఎగరటం తథ్యమనేలా రాజకీయాలు ఉన్నాయి.గతంలో కర్ణాటక జరిగిన రాజకీయాలకు మధ్యప్రదేశ్‌లో కూడా జరుగుతున్నాయి. రాజకీయం అంటే అంతేగా..అంతేగా.. అనేలా ఉంది నేటి రాజకీయ నేతల తీరు చూస్తుంటే..
See Also | భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు