Covid-19 Effect: కరోనా దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి.

Sensex Crashes Over 1,100 Points, Nifty Below 14,500 Dragged By Banks (1)
Sensex Crash : దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతుండటం ముదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
దాంతో ఆరంభంలోనే సెన్సెక్స్ భారీ పతనాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ 2.98శాతం నష్టపోయి 1,479 పాయింట్లు దిగువకు పడిపోయింది. మరింత క్షీణించిన సెన్సెక్స్ 48,112.17 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ కూడా పతనమై 14400 వద్ద నేగటీవ్ బేసిస్ లో ట్రేడ్ అవుతోంది. ఉదయం 9.41 గంటలకు సెన్సెక్స్ 1,194 పాయింట్లు కోల్పోయి 48,397 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 50 సూచీ 377 పాయింట్లు కోల్పోయి 2.54శాతం నష్టంతో 14,457 వద్ద ట్రేడ్ అయింది.
మరోవైపు అన్ని రంగాల షేర్లు, అమ్మకాల దెబ్బతో కుప్పకూలాయి. భారతదేశంలో గత 24 గంటల్లో కొత్త కరోనా కేసులు 1,68,912 నమోదయ్యాయి. ఏడు రోజుల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదు కోవడం ఇదో ఆరోసారి.
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితంగా చేస్తోంది. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలోనూ భారీ ప్రభావం పడింది. దేశంలో వైరస్ సోకిన వారిలో కొత్తగా 904 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 1,70,179కి చేరింది.