Tamil Nadu : బస్సును ఢీకొన్న కారు…ఏడుగురి మృతి

తమిళనాడు రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడులో ప్రభుత్వ బస్సును కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. సోమవారం రాత్రి టాటా సుమో కారు బెంగళూరు వెళుతుండగా, తిరువణ్ణామలై అంధనూర్ బైపాస్ సమీపంలో బస్సును ఢీకొంది....

Tamil Nadu : బస్సును ఢీకొన్న కారు…ఏడుగురి మృతి

Road Accident

Updated On : October 24, 2023 / 9:44 AM IST

Tamil Nadu : తమిళనాడు రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడులో ప్రభుత్వ బస్సును కారు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. సోమవారం రాత్రి టాటా సుమో కారు బెంగళూరు వెళుతుండగా, తిరువణ్ణామలై అంధనూర్ బైపాస్ సమీపంలో బస్సును ఢీకొంది. 10 మందితో ప్రయాణిస్తున్న టాటా సుమో తిరువణ్ణామలై నుంచి బెంగళూరుకు వెళ్తుండగా సెంగం సమీపంలో ప్రభుత్వ బస్సును ఢీకొట్టింది.

Also Read :   Durga Puja pandal : దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట…ముగ్గురి మృతి, పలువురికి గాయాలు

కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ సెంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సెంగం పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ కొనసాగుతున్నందున ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.