7 Young Indians: స్టూడెంట్ నుంచి సీఈవోలుగా.. కాలేజీ రోజుల్లో వచ్చిన ఐడియాలతో బిలియన్ డాలర్ల స్టార్టప్స్ నెలకొల్పారు.. యంగెస్ట్ ఇండియన్ బిలియనీర్స్ వీరే..
క్యాబ్ రైడ్స్ నుండి కిరాణా సామాగ్రి వరకు, ఈ ఏడుగురు యువ భారతీయ వ్యవస్థాపకులు కాలేజీ సమయంలో వచ్చిన ఆలోచనలను బిలియన్ డాలర్ల స్టార్టప్‌లుగా మార్చారు.

7 Young Indians: కాలేజీలో చదువుకునే సమయంలోనే వారికి అద్భుతమైన ఐడియాలు వచ్చాయి. చదువయ్యాక వాటిని అమలు చేశారు. అంతేకాదు సక్సెస్ కూడా అయ్యారు. ఇప్పుడు వందలు, వేల కోట్ల రూపాయలు విలువ చేసే సంస్థలకు సీఈవోలయ్యారు. బిలియన్ డాలర్ల విలువైన స్టార్టప్స్ నిర్మించారు. అందరితో శభాష్ అనిపించుకున్నారు. యువతకు ఆదర్శంగా నిలిచారు. అలాంటి ఏడుగురు యంగ్ ఇండియన్స్ గురించి ఇప్పుడు అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ సీఈవోలు ఎవరు? వారు ఏం చేశారు? ఎలా సక్సెస్ అయ్యారు? ఏమేం నెలకొల్పారు? ఇప్పుడు తెలుసుకుందాం..
క్యాబ్ రైడ్స్ నుండి కిరాణా సామాగ్రి వరకు, ఈ ఏడుగురు యువ భారతీయ వ్యవస్థాపకులు కాలేజీ సమయంలో వచ్చిన ఆలోచనలను బిలియన్ డాలర్ల స్టార్టప్‌లుగా మార్చారు. దేశ స్టార్టప్ రంగానికి కొత్త ఊపు తెచ్చారు. ఓలా, మీషో, జెప్టో, ఓయో, పేటీఎం, జెరోధా, ఫ్లిప్‌కార్ట్.. ఇలా ఒక్కొక్కటి ఒక్కో సంచలనం. వాటి వెనకున్న వ్యవస్థాపకులు వీరే..
ఓలా క్యాబ్స్ – భవిష్ అగర్వాల్
భవిష్ ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్. 23 ఏళ్ల వయసులోనే ఓలాను లాంచ్ చేశాడు. ఆయనకు ఓసారి క్యాబ్ లో వెళ్లిన సమయంలో చాలా చేదు అనుభవం ఎదురైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓలా క్యాబ్స్ కు రూపకల్పన చేశాడు. ఇప్పుడు ఓలా క్యాబ్స్ దేశంలో ఓ సంచలనం. నగరాల మధ్య ప్రయాణ సమస్యలకు ప్రాథమిక పరిష్కారంగా ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు భారతదేశంలోనే అగ్రశ్రేణి రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగింది.
మీషో – విధి ఆత్రే, సంజీవ్ బర్న్ వాల్
వీరిద్దరూ ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్లు. మీషో వ్యవస్థాపకులు. చిన్న అమ్మకందారులకు ప్రధానంగా మహిళలకు సామాజిక వాణిజ్యం ద్వారా సాధికారత కల్పించడానికి దీన్ని నెలకొల్పారు. అనతి కాలంలో దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈ ప్లాట్‌ఫామ్‌ను ఇప్పుడు మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. మెటా ద్వారా నిధులు సమకూరుతున్నాయి.
జెప్టో – ఆదిత్ పలిచా, కైవల్య వోహ్రా
కోవిడ్ సమయంలో స్టాన్‌ఫోర్డ్‌లో చదువు మానేసిన ఆదిత్, కైవల్యలు జెప్టోను ప్రారంభించారు. 18-19 సంవత్సరాల వయస్సులో వారు దీన్ని ఆవిష్కరించారు. కేవలం 10 నిమిషాల్లో కిరాణా సరుకుల డెలివరీ అనే కాన్సెప్ట్ సూపర్ సక్సెస్ అయ్యింది. దేశంలోని మోడల్ నగరాల్లో ఈ-కామర్స్ కు కొత్త నిర్వచనం చెప్పింది. అనతి కాలంలోనే వారు అపారమైన విజయాన్ని సాధించారు.
ఓయో రూమ్స్ – రితేశ్ అగర్వాల్
రితేశ్ గురించి తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అతడు కాలేజ్ డ్రాపౌట్. 19 ఏళ్ల వయసులోనో ఓయో రూమ్స్ ను ఆవిష్కరించాడు. ఇప్పుడు ఓయో దేశవ్యాప్తంగా పాపులర్. బడ్జెట్ హోటళ్లను ప్రామాణీకరించాలనే అతని ఆలోచన సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రపంచంలోని అతిపెద్ద హాస్పిటాలిటీ చైన్స్ లో ఒకటిగా ఓయో ఎదిగింది. దీనికి గ్లోబల్ ఇన్వెస్టర్ల మద్దతు కూడా ఉంది.
పేటీఎం – విజయ్ శేఖర్ శర్మ
2010 లో విజయ్ శేఖర్ శర్మ పేటీఎంను ప్రారంభించినప్పటికీ 2016 తర్వాత క్లిక్ అయ్యింది. భారత దేశం నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేయడం మొదలయ్యాక పేటీఎం అనూహ్య వృద్ధిని సాధించింది. శేఖర్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో చదువుకున్నాడు. ఓ చిన్న పట్టణ నుంచి వచ్చాడు. తన బ్యాంకు ఖాతాలో ఉన్న కేవలం 10 రూపాయలతో అతడు పేటీఎంను ప్రారంభించాడు.
జెరోదా – నితిన్, నిఖిల్ కామత్
నితిన్, నిఖిల్ ఇద్దరూ అన్నదమ్ములు. ఈ ఇద్దరు సోదరులు IIT లేదా IIM డిగ్రీలు లేకుండానే భారతదేశంలోని అతిపెద్ద స్టాక్ బ్రోకర్‌ను స్థాపించారు. స్టాక్ ట్రేడింగ్‌ను సరళీకృతం చేయడానికి ప్రారంభించబడిన జెరోధా భారతదేశంలో అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థగా మారింది.
ఫ్లిప్ కార్ట్ – సచిన్ అండ్ బిన్నీ బన్సల్
వీరిద్దరూ ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్లు. ఫ్లిప్‌కార్ట్‌ను ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌గా ప్రారంభించారు. తర్వాత ఇది దేశ ఈ-కామర్స్ లీడర్‌గా ఎదిగింది. వాల్‌మార్ట్ 16 బిలియన్ డాలర్లకు ఫ్లిప్ కార్ట్ ను కొనుగోలు చేసింది.