Shajapur : చెంప చెళ్లుమనిపించిన అదనపు జిల్లా కలెక్టర్

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ...దుకాణంలో ఉన్న ఓ వ్యక్తిపై అదనపు జిల్లా కలెక్టర్ మంజూషా దాడికి పాల్పడ్డారు. ఆ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. 

Shajapur : చెంప చెళ్లుమనిపించిన అదనపు జిల్లా కలెక్టర్

Shajapur

Updated On : May 24, 2021 / 7:29 PM IST

Additional Collector Slapping : కోవిడ్ నిబంధనల అమల్లో అధికారులు సంయమనం కోల్పోతున్నారు. ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపంచిన కలెక్టర్ ను ముఖ్యమంత్రి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది మరిచిపోకముందే..ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ…దుకాణంలో ఉన్న ఓ వ్యక్తిపై అదనపు జిల్లా కలెక్టర్ మంజూషా దాడి చేశారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. దీంతో కఠినమైన నిబంధనలు అమలు చేశారు. మధ్యప్రదేశ్ షాజాపూర్ లో అదనపు జిల్లా కలెక్టర్ మంజూషా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో..ఓ ప్రాంతంలో దుకాణం తెరిచి ఉండడాన్ని గ్రహించారు.

లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ..ఆ దుకాణంలో ఉన్న వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఇందర్ సింగ్ స్పందించారు. కలెక్టర్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read More : Wuhan Lab Researchers : కరోనా వైరస్ వ్యాప్తికి ముందే.. వూహాన్ ల్యాబ్ పరిశోధకులు జబ్బుపడ్డారు!