Sharad Pawar: శరద్ పవార్ నివాసంలో మీటింగ్‌కు ప్రతి పక్ష నేతలు

దేశంలో బీజేపీని అధికారం నుంచి దించేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి సిద్ధం కావాలని వివిధ పార్టీలు ఇప్పటినుంచే ప్రణాళికలు చేసుకుంటున్నాయి. ఒంటరిగా వెళితే విజయం సాదించలేమన్న ధోరణిలో కూటమిగా వెళ్లాలని భావిస్తున్నాయి.

Sharad Pawar: శరద్ పవార్ నివాసంలో మీటింగ్‌కు ప్రతి పక్ష నేతలు

Sharad Pawar

Updated On : June 22, 2021 / 4:24 PM IST

Sharad Pawar: దేశంలో బీజేపీని అధికారం నుంచి దించేందుకు 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి సిద్ధం కావాలని వివిధ పార్టీలు ఇప్పటినుంచే ప్రణాళికలు చేసుకుంటున్నాయి. ఒంటరిగా వెళితే విజయం సాదించలేమన్న ధోరణిలో కూటమిగా వెళ్లాలని భావిస్తున్నాయి. శరద్ పవర్ నాయకత్వంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి 2024 ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో ప్రతి పక్ష పార్టీలు సమావేశం అయ్యాయి.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు భేటీ అయ్యారు శరద్ పవర్. వీరిద్దరూ థర్డ్ ఫ్రంట్ గురించి చేర్చించినట్లుగా తెలుస్తుంది. మంగళవారం శరద్ పవర్ 15 పార్టీల అగ్రనేతలతో ఏర్పాటు చేశారు. ఈ భేటీలో థర్డ్ ఫ్రంట్ గురించి చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఎన్సీపీ నేత శరద్ పవర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ నేపథ్యంలోనే రాష్ట్రీయ ఫ్రంట్ పేరుతో 15 పార్టీల నేతలు కలిసి థర్డ్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. మంగళవారం జరుగుతున్న ఈ సమావేశంలో శరద్‌ పవార్‌తో పాటు ఫరూక్‌ అబ్లుల్లా, యశ్వంత్‌ సిన్హా సహా పలువురు ముఖ్యులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రణాళిక తయారు చేస్తారని తెలుస్తుంది. ఆ ప్రణాళిక ప్రకారం సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని శరద్ పవర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు,2024 లోక్ సభ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో శరద్ పవార్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

మోడీని ఎదుర్కొనే ప్రతిపక్ష నేత ఎంపికపై ప్రతిపక్ష నేతలు చర్చిస్తున్నారు. ఈ క్రమంలో చాలా రోజుల తరువాత ఒకే వేదిక పైకి చేరాయి విభిన్న రాజకీయ పక్షాలు.
.