పని ఒత్తిడి వల్ల మృతిచెందిన ఆ అమ్మాయి తల్లిదండ్రులను పరామర్శించిన శశిథరూర్‌.. కీలక కామెంట్స్

మేనేజర్ల నుంచి వచ్చిన పని ఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఈవై ఇండియా ఉద్యోగిని..

పని ఒత్తిడి వల్ల మృతిచెందిన ఆ అమ్మాయి తల్లిదండ్రులను పరామర్శించిన శశిథరూర్‌.. కీలక కామెంట్స్

Updated On : September 26, 2024 / 1:55 PM IST

ఆపీసులో పనిఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన కేరళ యువతి అన్నా సెబాస్టియన్ పెరయిల్ తల్లిని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పరామర్శించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఓ ట్వీట్ చేశారు.

‘మేనేజర్ల నుంచి వచ్చిన పని ఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఈవై ఇండియా ఉద్యోగిని, 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరాయిల్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లాను. బాధలో ఉన్న పెరాయిల్ తల్లిదండ్రులతో మాట్లాడాను. జవాబుదారీతనం ఉండడం, కొత్త చట్టాలు, వాటిలో నిబంధనల సవరణ గురించి మాట్లాడాను. మిడ్ లెవెల్ మేనేజర్లకు మెరుగైన ట్రైనింగ్ ఇవ్వాలి.

సిబ్బంది తక్కువగా ఉన్న కంపెనీలు విషపూరితమైన పని సంస్కృతిని కొనసాగిస్తున్నాయి. ఆవటిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. వీటిపై పెరాయిల్ తల్లిదండ్రులతో మాట్లాడాను. ఒక కంపెనీ తన ఉద్యోగులతో 16 గంటల సమయం పని చేయించుకోవాలని అనుకుంటే మరింత మంది ఉద్యోగులను నియమించుకోవాలి. అంతేగానీ, శ్రమ దోపిడీ చేస్తూ ఉద్యోగుల హక్కులను దుర్వినియోగం చేయొద్దు’ అని శశిథరూర్ అన్నారు.

కాగా, పుణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై)లో సీఏగా పనిచేసిన పెరాయిల్  పనిఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిందని ఆరోపణలు వస్తున్నాయి. ఆమె 4 నెలల క్రితమే ఉద్యోగంలో చేరి, అధిక గంటలు పనిచేసి తీవ్ర ఒత్తిడికి గురైందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

సునీతా విలియమ్స్‌ను తీసుకురావాల్సిన క్రూ-9 మిషన్‌ వాయిదా.. ఎందుకో తెలుసా?