Doctor Negligence: ఓరి నాయనో..! అక్కడ ఇన్‌ఫెక్షన్ ఉందని వెళితే.. ఏకంగా వాటిని తొలగించేసిన డాక్టర్.. లబోదిబోమంటున్న పేషంట్..

దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఒక వైద్యుడు సాధారణ బయాప్సీ ప్రక్రియలో తన జననాంగాలను తొలగించడానికి అనధికార శస్త్రచికిత్స చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Doctor Negligence: ఓరి నాయనో..! అక్కడ ఇన్‌ఫెక్షన్ ఉందని వెళితే.. ఏకంగా వాటిని తొలగించేసిన డాక్టర్.. లబోదిబోమంటున్న పేషంట్..

Updated On : July 6, 2025 / 5:21 PM IST

Doctor Negligence: అస్సాంలోని కాచార్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ ఒక ఆసుపత్రిలో 28 ఏళ్ల వ్యక్తి జననేంద్రియాలను అతడి అనుమతి లేకుండా బయాప్సీ పరీక్ష సమయంలో డాక్టర్ తొలగించాడని ఆరోపణలు ఉన్నాయి. ఓ వ్యక్తి జననేంద్రియ ఇన్ఫెక్షన్ ఫిర్యాదులతో ఆసుపత్రికి వెళ్లగా ఈ దారుణం జరిగిపోయింది.

మణిపూర్‌లోని జిరిబామ్ జిల్లాకు చెందిన బాధితుడు రెహమాన్ జననేంద్రియ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు. దీంతో అతడు సిల్చార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లాడు. బయాప్సీ పరీక్ష తర్వాత అతడు షాక్ కి గురయ్యాడు. చూసుకుంటే.. జననాంగాలు కనిపించలేదు. దీంతో అతడు నిర్ఘాంతపోయాడు. తన అనుమతి లేకుండానే డాక్టర్ జననాంగాలను తొలగించాడని అతడు ఆరోపిస్తున్నాడు.

దీనిపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోని ఒక వైద్యుడు సాధారణ బయాప్సీ ప్రక్రియలో తన జననాంగాలను తొలగించడానికి అనధికార శస్త్రచికిత్స చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు ఇప్పటివరకు స్పందించలేదు. అక్కడ ఎవరూ అందుబాటులో లేరు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్ కూడా కనిపించడం లేదు. ఫోన్ కాల్స్ కు, మేసేజ్ లకు కూడా అతడు స్పందించడం లేదని పోలీసులు గుర్తించారు.

Also Read: అంబానీ కాసుకో.. రిలయన్స్‌కు గట్టి పోటీగా అదానీ భారీ ప్రాజెక్ట్.. ఏ ప్లాంట్ పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఏం ఉత్పత్తి చేస్తారంటే..

“జూన్ 19న, నా జననాంగాలలో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత నేను సిల్చార్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాను. డాక్టర్ నన్ను బయాప్సీ పరీక్ష కోసం వెళ్లమని సలహా ఇచ్చారు. నా బయాప్సీ పరీక్ష సమయంలో, వారు నా అనుమతి లేకుండా శస్త్రచికిత్స ద్వారా నా జననాంగాలను తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత నేను మేల్కొన్నప్పుడు, నా జననాంగాలను తొలగించినట్లు నేను కనుగొన్నాను. నేను డాక్టర్ ని అడిగితే అతను సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు” అని రెహమాన్ ఆరోపించాడు.

తన జననాంగాలను అనధికారికంగా తొలగించారనే ఆరోపణలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు రెహమాన్ విజ్ఞప్తి చేశాడు. “ఇప్పుడు, నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నాను. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నా జీవితం ముగిసింది. నేను చాలాసార్లు డాక్టర్ ని సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ ఆయన నా కాల్స్‌కు స్పందించలేదు. సర్జరీ కారణంగా నేను మానసికంగా కుంగిపోతున్న” అని రెహ్మాన్ వాపోయాడు.