Heart Attack : షాకింగ్ వీడియో.. గదర్ 2 సినిమా చూసేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి

అతడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇంతలో సడెన్ గా అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. Heart Attack - Gadar 2

Heart Attack : షాకింగ్ వీడియో.. గదర్ 2 సినిమా చూసేందుకు వెళ్లి గుండెపోటుతో మృతి

Heart Attack - Gadar 2 (Photo : Google)

Updated On : August 29, 2023 / 12:45 AM IST

Heart Attack – Gadar 2 : గుండెపోటు మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్న, పెద్ద తేడా లేదు.. చివరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు, ఎంతో హెల్తీగా ఉన్న వారు కూడా సడెన్ గా గుండెపోటుతో చనిపోతున్నారు. హార్ట్ ఎటాక్ తో అక్కడికక్కడే కుప్పకూలుతున్నారు. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోవడం అందరిలోనూ ఆందోళన నింపింది. తాజాగా సినిమా చూసేందుకు వెళ్లిన యువకుడు గుండెపోటుతో సినిమా హాల్ లోనే మరణించాడు.

ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీలో జరిగింది. తివారీ (35) అనే వ్యక్తి గదర్ 2 సినిమా చూసేందుకు ఫన్ మాల్ కి వెళ్లాడు. అక్కడ అతడికి ఫోన్ కాల్ వచ్చింది. దాంతో అతడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇంతలో సడెన్ గా అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. గుండెపోటుతో అతడు అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. ఆ వ్యక్తి ఫోన్ లో మాట్లాడుతూ సడెన్ గా కుప్పకూలడం మాల్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

Also Read..Pressure Cooker : ప్రెజర్ కుక్కర్‌తో ప్రియురాలి హత్య, ఆ అనుమానంతో అమానుషం

మృతుడి పేరు అక్షత్ తివారీ. ద్వారకాపురలో నివాసం ఉంటాడు. ఫార్మాక్యూటికల్ ట్రేడర్ గా చేస్తున్నాడు. గదర్ 2 సినిమా చూసేందుకు ఫన్ మాల్ కి వెళ్లాడు. మాల్ లోకి రాగానే అతడికి ఫోన్ కాల్ వచ్చింది. దాంతో అతడు ఫోన్ లో మాట్లాడుకుంటూ హాల్ లోపలికి వెళ్లాడు. అంతే, ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిపోయాడు. ఇది చూసిన ఇతర వ్యక్తులు, మాల్ సిబ్బంది షాక్ కి గురయ్యారు. ఏం జరిగిందో అర్థం కాక కంగారుపడ్డారు. అతడికి దగ్గరగా వెళ్లారు. యువకుడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. కానీ, అతడు లేవలేదు. తివారీ మెడికల్ షాప్ నడుపుతున్నాడు. శనివారం లేట్ నైట్ షో చూసేందుకు ఫన్ మాల్ కి వెళ్లాడు. రాత్రి 7గంటల 45 నిమిషాలకు అతడు మాల్ లోకి ఎంటర్ అయ్యాడు. మాల్ లోకి అడుగుపెట్టిన సెకన్ల వ్యవధిలో కుప్పకూలాడు.

Also Read..Viral Video : వామ్మో.. మద్యం మత్తులో నడిరోడ్డుపై రెచ్చిపోయిన మహిళ, పచ్చి బూతులు తిడుతూ పోలీసులపైనే దాడి

అక్షత్ తివారీ వయసు జస్ట్ 35ఏళ్లే. పెద్ద వయసేమీ కాదు. పైగా అనారోగ్య సమస్యలు ఏవీ లేవని తెలుస్తోంది. అలాంటి యువకుడు ఇలా సడెన్ గా గుండెపోటు బారిన పడటం, చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. ఈ గుండెకు ఏమైంది? ఎందుకింత బలహీనంగా మారింది? అనే ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాగా, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఆందోళన, ఒత్తిడి.. గుండెపోటు రిస్క్ ను పెంచాయన్నది వైద్య నిపుణుల మాట.