Pressure Cooker : ప్రెజర్ కుక్కర్‌తో ప్రియురాలి హత్య, ఆ అనుమానంతో అమానుషం

పోలీసుల విచారణలో దేవిని తానే హత్య చేసినట్టు అతడు ఒప్పుకున్నాడు. Pressure Cooker - Bengaluru

Pressure Cooker : ప్రెజర్ కుక్కర్‌తో ప్రియురాలి హత్య, ఆ అనుమానంతో అమానుషం

Pressure Cooker - Bengaluru (Photo : Google)

Pressure Cooker – Bengaluru : అనుమానం పెను భూతంగా మారుతోంది. దారుణాలకు కారణం అవుతోంది. హత్యలకు ఉసిగొల్పుతోంది. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న వారి మధ్య చిచ్చు రాజేస్తోంది. తాజాగా.. అనుమానంతో ప్రియురాలిని కడతేర్చాడో ప్రియుడు. ప్రెజర్ కుక్కర్ తో తన లివింగ్ పార్టనర్ ను హత్య చేశాడు. ఈ దారుణం బెంగళూరులో చోటు చేసుకుంది.

కేరళకు చెందిన వైష్ణవ్, దేవి జంట ప్రేమికులు. మూడేళ్లుగా పరిచయం ఉంది. ఈ క్రమంలో రెండేళ్లుగా బెంగళూరులో సహజీవనం చేస్తున్నారు. బెంగళూరులో ఓ ఫ్లాట్ లో వీరు రెంట్ కి ఉంటున్నారు. వైష్ణవ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. షేర్ మార్కెట్ ట్రేడింగ్, మార్కెటింగ్ కు సంబంధించిన విధులను ఇంటి నుంచే నిర్వర్తిస్తుండే వారు.

Also Read..Viral Video : వామ్మో.. మద్యం మత్తులో నడిరోడ్డుపై రెచ్చిపోయిన మహిళ, పచ్చి బూతులు తిడుతూ పోలీసులపైనే దాడి

అయితే, దేవి (24) మీద వైష్ణవ్ కి అనుమానం మొదలైంది. దేవి మరొకరితో సంబంధం కలిగి ఉందేమో అని డౌట్ పడ్డాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. శనివారం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. ఇద్దరి మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో వైష్ణవ్ కోపంతో ఊగిపోయాడు. కిచెన్ లోకి వెళ్లాడు. ప్రెషర్ కుక్కర్ తీసుకొచ్చి ఆమె తలపై మూడుసార్లు బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో దేవి స్పాట్ లోనే చనిపోయింది. ఆ తర్వాత వైష్ణవ్ అక్కడి నుంచి పారిపోయాడు.

దేవి సోదరి కృష్ణ కాల్ లో ఈ దారుణం బయటపడింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా దేవి లిఫ్ట్ చేయలేదు. దాంతో ఆమెకు అనుమానం వచ్చింది. వెంటనే దేవి పొరుగింటి వారికి ఫోన్ చేసింది. వారు వచ్చి చూడగా షాక్ అయ్యారు. దేవి రక్తపు మడుగులో పడి ఉంది. దేవి, వైష్ణవ్ ల మధ్య గొడవ గురించి తనకు తెలుసంది. దేవి ఎవరికో అదే పనిగా మెసేజ్ లు పంపుతోందని వైష్ణవ్ ఆరోపించినట్టు దేవి సోదరి వివరించింది. తాను ఇద్దరికీ సర్ది చెప్పి మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇంటికి పంపించానని వెల్లడించింది. ఇద్దరూ సర్దుకుపోతారని తాను అనుకున్నానని, కానీ ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని కన్నీటిపర్యంతం అయ్యింది దేవి సోదరి కృష్ణ.

Also Read..Kota : కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి సూసైడ్, 6వ ఫ్లోర్ నుంచి దూకేశాడు.. అసలేం జరుగుతోంది

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న వైష్ణవ్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో దేవిను తానే హత్య చేసినట్టు అతడు ఒప్పుకున్నాడు.