Doctor Dies Of Heart Attack In Gym : షాకింగ్ వీడియో.. జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గుండెపోటు డాక్టర్ మృతి

Doctor Dies Of Heart Attack In Gym : షాకింగ్ వీడియో.. జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గుండెపోటు డాక్టర్ మృతి

Updated On : January 8, 2023 / 8:40 PM IST

Doctor Dies Of Heart Attack In Gym : ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఏజ్ తో సంబంధమే లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో హఠాన్మరణం చెందుతున్నారు. మూడు పదుల వయసు కూడా దాటని వారు, చివరికి యంగర్స్ సైతం గుండెపోటుతో మరణిస్తున్నారు.

ఒకప్పుడు వృద్ధులకు, దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడే వారికి మాత్రమే హార్ట్ ఎటాక్ వచ్చేది. ఇప్పుడు, వయసుతో సంబంధం లేదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు.. ఫిట్ గా ఉండి, జిమ్ చేస్తున్న వారు సైతం కార్డియాక్ అరెస్ట్ తో చనిపోతున్నారు. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది.

Also Read..Heart Attack : అవతార్ 2 సినిమా చూస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణం ; ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై కార్డియాలజిస్టులు ఏమంటున్నారంటే?

తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జిమ్ లో వర్కౌట్ చేస్తూ డాక్టర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన పేరు సంజీవ్ పాల్. వయసు 41ఏళ్లు. జిమ్ కి వెళ్లి వర్కౌట్లు చేయడం డాక్టర్ కు అలవాటు. ఇదే క్రమంలో శుక్రవారం జిమ్ కి వెళ్లారు. అక్కడ వర్కౌట్స్ చేస్తున్నారు. ఇంతలో సడెన్ గా కుప్పకూలిపోయారు. ఇది గమనించిన ఇతరులు కంగారుగా ఆయన దగ్గరికి వెళ్లారు. చలనం లేకుండా పడున్న డాక్టర్ ను ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన డాక్టర్లు.. ఆ డాక్టర్ గుండెపోటుతో అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.

ఇటీవలే మధ్యప్రదేశ్ ఇండోర్ లోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. జిమ్ లో ఓ హోటల్ యజమాని గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడి పేరు ప్రదీప్ రఘువంశీ (55). బృందావన్ హోటల్ యజమాని. ఆయనకు జిమ్ కు వెళ్లే అలవాటు ఉంది. జిమ్ లో కసరత్తులు చేస్తాడు. ఎప్పటిలాగే జిమ్ కెళ్లి ట్రెడ్‌మిల్‌ పై నడిచాడు. తర్వాత అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అంతే, చూస్తుండగానే.. నేల మీద కుప్పకూలాడు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న కొందరు యువకులు వెంటనే ప్రదీప్ ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

Also Read..Heart Attack : చలికాలంలో గుండె పోటు మరణాలు అధికమా! ఎందుకిలా ?

డాక్టర్ సంజీవ్ పాల్ జిమ్ లో కసరత్తు చేస్తూ కుప్పకూలి చనిపోవడం.. జిమ్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా.. హెల్తీగా, ఫిట్ గా ఉన్నా, జిమ్ చేసే వారు, ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ తీసుకునే డాక్టర్లు సైతం ఇలా గుండెపోటుతో మరణిస్తుండటం ఆందోళన కలిగించే అంశం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇంతకు ముందు వృద్ధులకు, జబ్బులతో బాధపడేవారికి మాత్రమే గుండెపోటు వస్తుందని నమ్మేవారు. అయితే గత కొద్ది రోజులుగా వచ్చిన వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు.. ఇది అవాస్తవమని తేల్చేశాయి. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, భారతదేశంలో దాదాపు 50 శాతం గుండెపోటు కేసులు 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో.. 25 శాతం 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఆందోళన కలిగించే అంశం.

జిమ్ లో గుండెపోటుతో డాక్టర్ మృతి..